అలియా కి నచ్చనిది శ్రద్ధకి నచ్చిందా?

Update: 2017-11-30 10:00 GMT

బాహుబలి మూవీ తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ లో బాహుబలి ప్రభాస్ గా ప్రభాస్ పేరు మారుమోగిపోయింది. ఇక బాహుబలి లో కండలు తిరిగిన ప్రభాస్ నటన చూసిన బాలీవుడ్ భామలు చాలామందే మనసు పారేసుకున్నారు. అందులో అలియా భట్ కూడా ఉంది. అవకాశం వస్తే ప్రభాస్ పక్కన రెడీ అంది. అయితే ప్రభాస్ మీద ఉన్న అంచనాల నేపధ్యం లో ప్రభాస్ తన తదుపరి మూవీ అయిన సాహో కోసం ఒక రేంజ్ లో కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమా లో ప్రభాస్ కి జోడి గా బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ నటిస్తుంది. అయితే చిత్ర బృందం శ్రద్ద కపూర్ ని ఎంపిక చేయకముందు.. చాలామంది హీరోయిన్స్ పేర్లను పరిశీలించారు.

అందులో అనుష్క శర్మ, కత్రిన కైఫ్, అలియా భట్ ఉన్నారు. అయితే ఈ హీరోయిన్స్ లో అనుష్క ఇంకా కత్రిన రెమ్యునరేషన్స్ పరంగా డ్రాప్ అయితే అలియా భట్ మాత్రం హీరోయిన్ పాత్ర నచ్చక సాహో ని రిజెక్ట్ చేసిందట. సాహో కథ మెచ్చిన అలియా భట్ కేవలం హీరోయిన్ క్యారెక్టర్ డల్ గా ఉంది అని చెప్పి ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఇక అలియా భట్ నో చెప్పాక మూవీ యూనిట్ వెళ్లి శ్రద్ధ కపూర్ ని సంప్రదిస్తే శ్రద్ధ కపూర్ వెంటనే మూవీ చేయడానికి ఓకే చెప్పిందట.

మరి అలియా భట్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ని శ్రద్ద కపూర్ ఒకే చేసింది అంటే.. శ్రద్ద కపూర్ కి సాహో కథ నచ్చబట్టేగా.. మరి అందులో అలియా భట్ కి నచ్చని దేమిటో... శ్రద్ధకి నచ్చినదేమిటో అని బాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా అందరు ఇప్పుడు తెగ చర్చించేసుకుంటున్నారు. ఇకపోతే సాహో చిత్రం విడుదలై విజయం సాధిస్తే శ్రద్ధ కపూర్ సూపర్ అంటారు. ఒకవేళ సాహో ఫలితం ఆటో ఇటో అయితే... అలియా సూపర్ అంటారు. చూద్దాం ఫైనల్ గా ఎవరు సూపరో.

Similar News