అలాగైతే నా పేరే వేసుకుంటా

Update: 2017-09-19 15:00 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ మరొక్క రోజులోనే థియేటర్స్ లోకి రానుంది. ఈ గురువారం విడుదలవుతున్న జై లవ కుశ చిత్రం రేపు అంటే బుధవారం రాత్రి నుండే పలు థియేటర్స్ లో బెన్ఫిట్ షోలతో హడావిడి షురూ చేయనుంది. జై లవ కుశ చిత్ర బృందమేమో గాని ఎన్టీఆర్ మాత్రం జై లవ కుశ పబ్లిసిటీలో భాగంగా పలు ఛానల్స్ కి, ప్రింట్ మీడియాకి, వెబ్ మీడియాకి ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తూ జై లవ కుశను భారీగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ అనేక కొత్త సంగతులను వివరిస్తున్నాడు. హీరోల మధ్యన ఆరోగ్యకర పోటీ ఉండాలని... ఆ పోటీ ఎప్పుడూ నష్టాలకు దారి తియ్యకుండా ఉండాలని చెబుతున్నాడు.

ఏ హీరో అభిమానులు తక్కువకాదని.. మంచి కథ, మంచి దర్శకుడు దొరికితే ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి తానెప్పుడూ సిద్ధమంటూ ప్రకటించాడు ఎన్టీఆర్. అలాగే తాను తమిళ మార్కెట్ కి అప్పుడే వెళ్లాలని అనుకోవడం లేదని...చెప్పిన తారక్ జై లవ కుశ మీద వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చాడు. జై లవ కుశ చిత్ర దర్శకుడు బాబీ అయినా కూడా దర్శకత్వంలో ఎన్టీఆర్ ఎంటర్ అయ్యాడనే వార్తలకు స్పందించిన తారక్.... సినిమా పరంగా దర్శకుడు బాబీకి కొన్ని సలహాలు ఇవ్వడం తప్ప.. దర్శకత్వం మొత్తం బాబినే చేసుకున్నాడు. ప్రతి సినిమాలో హీరో, డైరెక్టర్, నిర్మాత మధ్య జరిగే చర్చలే ఈ సినిమాకు కూడా జరిగాయి. అంతేగానీ దర్శకత్వం విషయంలో ఎవరూ తలదూర్చలేదు. ఈ సినిమా రేపు విజయం సాధించింది అంటే ఆ క్రెడిట్ మొత్తం బాబీకే చెందుతుంది అని చెప్పాడు.

అలాగే నేను దర్శకత్వం చేసాను అంటే..... అసలు అలా చేసే పరిస్థితే ఉంటే నేనే సినిమాకు డైరెక్షన్ చేసుకునేవాడిని కదా.. పేరు కూడా నాదే వేసుకుంటా కదా. అలాగే అసలు నా పేరును నేనే డైరెక్టర్‌గా వేసుకుని ఒక సినిమా చేస్తే నన్ను ఎవరైనా అడుగుతారా..? అంటూ ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసాడు.

Similar News