అలాంటిదేం లేదంటున్న హీరో

Update: 2018-02-27 08:13 GMT

గత రెండు రోజులుగా టాలీవుడ్ హీరో రవితేజ గాయపడ్డాడని... నెల టిక్కెట్ సినిమా షూటింగ్ లో రవితేజ కి గాయాలయ్యాయంటూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో అనేక రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నెల టిక్కెట్ సినిమా లో నటిస్తున్న రవితేజ ఒక సీన్ లో భాగంగా ఒక స్పోర్ట్స్ బైక్ మోనో వీల్ ని డ్రైవ్ చేస్తూ అదుపుతప్పి పడిపోయాడని... కాస్త గాయాలవడంతో పక్కనే ఉన్న హాస్పిటల్ కి రవితేజని తరలించినట్టుగా వార్తలొచ్చాయి. కొద్దిపాటి రెస్ట్ తో రవితేజ మల్లి షూటింగ్ లో పాల్గొంటాడని అన్నారు. అయితే టచ్ చేసి చూడు సినిమా డిజాస్టర్ తో బాధపడుతున్న రవితేజ ఈ సమయంలో ఇలా మళ్ళీ షూటింగ్ సమయంలో గాయాల పాలవడంతో... రవితేజ అభిమానులు ఒకింత షాక్ కి గురయ్యారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని కూడా వారు దేవుణ్ణి ప్రార్ధించారు.

మరి ఇంత జరుగుతున్నా రవితేజ గాని, నెల టిక్కెట్ చిత్ర బృందం గాని ఎక్కడా రవితేజకి గాయాలయ్యానని స్పందించలేదు... వాటిని ఖండించను లేదు.

కానీ తాజాగా రవితేజ తనకు ఎటువంటి గాయాలు కాలేదని.. తన మీద వచ్చిన ఆ యాక్సిడెంట్ వార్తలన్నీ కేవలం రూమర్స్ అని సోషల్ మీడియా లో ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు.తనకేం అవలేదని... తాను చాలా బావున్నానని.. తనపై వచ్చిన వార్తలన్నీ కేవలం అసత్య వార్తలని... తాను పర్ఫెక్ట్ గా వున్నాని ట్వీట్ చేసాడు రవితేజ. మరి రవితేజ ఈ ట్వీట్ తో రవితేజ అభిమానులు కాస్త హ్యాపీ మోడ్ లోకి వెళ్లారు. ఇకపోతే టచ్ చేసి చూడు తర్వాత రవితేజ ఒక సినిమాని కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లోను, మరో సినిమా శ్రీను వైట్ల డైరెక్షన్ లోను చేస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణతో ప్రస్తుతం సెట్స్ మీదున్న రవితేజ, శ్రీను వైట్ల డైరెక్షన్ లో కొద్దీ రోజుల్లోనే సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు

Similar News