టాలీవుడ్ లోకి ఒక కొత్త ముద్దుగుమ్మ మరో రెండు రోజుల్లో ప్రేక్షకులకి పరిచయం కాబోతుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు నితిన్ కి జోడిగా 'లై' చిత్రంలో నటిస్తున్న మేఘ ఆకాష్. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన 'లై' చిత్రంలో మేఘ ఆకాష్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మరో రెండు రోజులంటే వచ్చే శుక్రవారమే 'లై' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే మేఘ ఆకాష్ తెలుగు తెరకు ఎలా పరిచయం కాబోతుందో అని చాలామంది చాలా రకాలుగా చర్చలు జరిపారు. మేఘ ఆకాష్ తెలుగు తెరకు పరిచయమవడానికి చిన్నపాటి కథే వుంది. ఈ కథని కూడా 'లై' హీరో నితినే రివీల్ చేసాడు.
నితిన్, మేఘ ఆకాష్ గురించి ఏం చెప్పాడంటే.... అసలు మేఘ ఆకాష్ 'లై' చిత్రంలో నటించడానికి కారణం నితిన్, డైరెక్టర్ హను కాదట. మేఘ ఆకాష్ ని మొదటగా పట్టుకున్నది మాత్రం డైరెక్టర్ గౌతమ్ మీనన్ అంట. గౌతమ్ మీనన్ చిత్రానికే మేఘ ఆకాష్ ఫస్ట్ అగ్రిమెంట్ చేసిందట. అలా మేఘ తో అగ్రిమెంట్ అయ్యాక గౌత మీనన్ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు... నితిన్ ని కలిసాడంట. నితిన్ ని కలిసిన గౌతమ్ మీనన్ తన ల్యాప్ టాప్ లో మేఘా ఆకాష్ ఫొటోలు, వీడియోలు చూపించాడట. అయితే అక్కడే నితిన్ తో పాటు మేఘాను చూసిన దర్శకుడు హను రాఘవపూడి 'లై' కోసం ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారట.
కేవలం అదొక్కటే మేఘ ఆకాష్ ని ఈ సినిమా కోసం తీసుకోవడానికి కారణం కాదట. మరో కారణం కూడా ఉందట. 'లై' చిత్రం చాలా భాగం అంటే 75 రోజుల పాటు అమెరికాలో షూటింగ్ జరపాల్సి ఉండడంతో... స్టార్ హీరోయిన్ ని 'లై' కోసం తీసుకుంటే ఏకంగా 75 రోజల పాటు ఏ స్టార్ హీరోయిన్ కాల్షీట్లు ఇవ్వదని......అందుకే మేఘా ఆకాష్ ను సెలక్ట్ చేశామంటున్నాడు. అలాగే స్టార్ హీరోయిన్ 75 రోజుల కాల్షీట్స్ కి భారీగా సమర్పించాల్సి వస్తుంది కాబట్టే ఇలా కొత్త అమ్మాయి మేఘ కి ఓటేసింది 'లై' చిత్ర యూనిట్