టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన మొదటి సినిమాలో నటించిన హీరోతోనే ప్రేమలో పడ్డ సమంత త్వరలోనే ఆ హీరో నాగ చైతన్యతో పెళ్లిపీటలెక్కబోతుంది. అయితే సమంత మాత్రం ఏం మాయచేసావే టైం లో నాగ చైతన్యని లవ్ చెయ్యలేదని ఆ తర్వాత కొన్నేళ్ళకి తమ స్నేహం కాస్తా ప్రేమగా చిగురించిందని.... ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది. టాలీవుడ్ లో మోస్ట్ లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట అక్టోబర్ 6, 7 తేదీలలో హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాల్లో పెళ్లిచేసుకోబోతున్నారు. అయితే నాగ చైతన్యతో లవ్, పెళ్లి విషయాల్లో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సమంత ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
అసలు సమంత , నాగ చైతన్యతో ప్రేమలో ఎలా పడింది అనే విషయాన్నీ వివరంగా చెప్పింది. నేను మొదటిసారి నాగ చైతన్యతో ఏ మాయ చేసావే సినిమాలో కలిసి పని చేస్తున్నప్పుడే చైతు మంచితనానికి ఫిదా అయిపోయాను. ఇంకా చైతుకి నన్ను అర్ధం చేసుకోవడంలో ఒక అవగాహన ఉంటుందని.... తాను బాధలో ఉన్నప్పుడు చైతు ఓదార్పు తనకి బాగా నచ్చే విషయమని, మరి ఇన్ని పాజిటివ్ విషయాలున్నప్పుడు చైతూని ఎవరైనా ఇష్టపడతారు...... అలాగే నేను ఇష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చిందిసమంత.
అంతే కాకుండా తాను ఒక మంచి ఫ్యామిలీ అయిన అక్కినేని ఇంటికి కోడలిగా వెళుతున్నాని చెబుతూ.. పెళ్లి తర్వాత నా విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని గట్టిగా చెప్పేసింది. ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలానే ఉంటానని వివరిస్తూ.. చైతు తో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాని చెప్పింది ఈ నవ వధువు సమంత.