అలా ఎందుకు ఆలోచించడం లేదు

Update: 2017-12-04 12:00 GMT

మహేష్ బాబు స్పైడర్ సినిమాతో తమిళంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. దర్శకుడు మురుగదాస్ కూడా తెలుగు ప్రేక్షకులను లైట్ తీసుకుని.... తమిళులకు నచ్చే విధంగా స్పైడర్ సినిమాని చెక్కాడు. ఆ సినిమా అటు తెలుగు ప్రేక్షకులకు.. ఇటు తమిళులకు కూడా నచ్చలేదు. దాంతో మహేష్ తమిళ ఎంట్రీ ఆశలు గల్లంతైయ్యాయి. ఇదివరకు తన హిట్ సినిమాలను తమిళంలో డబ్ చేసి వదిలేవాడు. ఆ సినిమాలకు కాస్తొ కూస్తో మంచి పేరొచ్చి కలెక్షన్స్ కొల్లగొట్టేవి. అయితే మహేష్ బాబు ఇప్పుడొక తప్పు చేస్తున్నాడు.

అదేమిటంటే స్ట్రయిట్ తమిళ మూవీ స్పైడర్ సినిమా ప్లాప్ తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి తన సినిమాలను తమిళంలోకి డబ్ చేస్తే బావుండేది. అయితే స్పైడర్ కి కొరటాల తో చేస్తున్న భరత్ అనే నేను సినిమాకి చాలా గ్యాప్ ఉందిగా అని అనుకోవచ్చు కానీ.. మహేష్ అట్టర్ ప్లాప్ చిత్రం బ్రహ్మ్మోత్సవం సినిమాని తమిళంలోకి డబ్ చేసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్నీ బ్రహ్మ్మోత్సవం లో అస్సలు ప్రాధాన్యత లేని పాత్ర చేసిన ప్రణీత చెప్పింది. ప్రణీత సోషల్ మీడియాలో బ్రహ్మ్మోత్సవం తమిళ డబ్బింగ్ కమింగ్ సూన్ అంటూ పోస్ట్ పెట్టింది.

దానితో తెలుగులో అట్టర్ ప్లాప్, బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన బ్రహ్మ్మోత్సవాన్ని మహేష్ మరియు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎలా డబ్ చేస్తున్నారు. ఈ దెబ్బకి మహేష్ క్రేజ్ తమిళంలో పడిపోతుందనే టాక్ కోలీవుడ్ మీడియాలో వినబడుతుంది. స్పైడర్ ప్లాప్ అయినా మరో మంచి సినిమాతో తమిళంలోకి వెళితే అది కాస్త హిట్ అయితే మళ్ళీ అక్కడ మహేష్ మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉండేది. కానీ ఒక బిగ్గెస్ట్ అట్టర్ ప్లాప్ సినిమాని డబ్ చేసి విడుదల చెయ్యడం అనేది పెద్ద మిస్టేక్ అంటున్నాయి ట్రేడ్ ఆవర్గాలు. అసలు మహేష్ ఆ పరంగా ఎందుకు ఆలోచిందడం లేదంటున్నారు.

Similar News