అటు బులితెరని ఇటు వెండితెరకి కూడా ఏలుతున్న హాట్ యాంకర్.. ఇప్పుడు అనేక సిఎంమాల్లో నటిస్తూ బిజీగా వుంది. అనసూయ రామ్ చరణ్ రంగస్థలంలో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే గత కొంతకాలంగా “సచ్చిందిరా గొర్రె” అనే సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న అనసూయ, లేటెస్ట్ గా ఫేస్ బుక్ లో లైవ్ చాటింగ్ చేస్తూ తనను అంటీ అంటూ కామెంట్ చేసిన ఒక నెటిజన్ పై సీరియస్ అయ్యింది. ఆ అభిమాని, 'హాయ్ అను అంటీ' అని కామెంట్ పెట్టడంతో అనసూయకి కోపం విపరీతంగా వచ్చేసింది.
వెంటనే అనసూయ అతడి పై సీరియస్ అవుతూ. 'గడ్డాలు మీసాలు పెంచుకొని నాకే అంకుల్ లా ఉన్న మీరు నన్ను ఆంటీ అని పిలవడం ఏంటి? కాస్త చదువుకున్న వారిలా ప్రవర్తించండి' అంటూ కొంచెం గట్టిగానే క్లాస్ పీకింది. అంటీ అనే పదాన్ని బూతుగా మార్చేశారని, ఆ ఆంగిల్ లో తనని ఆంటీ అని పిలిస్తే సీరియస్ అవుతాను అని చెప్పుకొచ్చింది అనసూయ. అసలు తన పిల్లల స్నేహితులు తనని అంటీ అంటే పలుకుతానని కూడా చెప్పింది. ఈ పదం ఎక్కడ, ఎవరితో వాడాలో తెలుసుకోవాలి అంటూ మండిపడింది.
అలాగే జబర్దస్త్ లో ఆది చేసిన స్కిట్ వలన అనాధ బాలికలు మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అనాధబాలికలు ఆది మీద.. జబర్దస్త్ యాంకర్, జడ్జి ల మీద కేస్ పెట్టగా... దాని మీద కూడా స్పందించిన అనసూయ.. హాస్యం కోసం చేస్తున్న షో ని అలాగే చూడాలని.. దాన్ని వివాదం చెయ్యడం బాగోలేదని చెప్పుకొచ్చింది.