అర్జున్ రెడ్డిగా అల్లు అర్జున్ అయితే బాగుండేదంటున్నాడు

Update: 2017-08-26 12:00 GMT

విజయ దేవరకొండ హీరోగా... డెబ్యూ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' నెగటివ్ పబ్లిసిటీతో పాజిటివ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఆనాటి 'దేవదాసు' చిత్రాన్ని తలపిస్తూ ఈనాటి తరానికి సూటయ్యే దేవదాసులా ఉందంటూ ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తునాన్రు యువత. అయితే ఈ సినిమాలో ఉన్న లిప్ లాక్ కిస్సులు ముందు కాంట్రవర్సీ క్రియేట్ చేసినా సినిమాలో బావుంటాయనే కామెంట్స్ చేస్తున్నారు కుర్రకారు. అయితే ఈ అర్జున్ రెడ్డి చిత్రంలో ఒక స్టార్ హీరో ఎవరైనా నటిస్తే ఎలావుంటుంది.. ఒకవేళ స్టార్ హీరోని ఎవరినైనా తీసుకుంటే ఎవరిని తీసుకుంటారని.... సందీప్‌ రెడ్డి వంగా ని అడగగా అయన దీనికి సమాధానంగా అల్లు అర్జున్ అయితే సూపర్ గా ఉండేదంటూ టక్కుమని సమాధానం చెప్పాడు.

అసలు ఈ కథని ముందుగా అల్లు అర్జున్ కి వినిపిద్దామని అనుకున్న కానీ కొన్ని కారణాల వాళ్ళ అది కుదరలేదు. ఈ 'అర్జున్ రెడ్డి' కేరెక్టర్ ని ఒక స్టార్ హీరో చెయ్యాలి అంటే అది కేవలం అల్లు అర్జున్ మాత్రమే చేయగలడని... ఈ పాత్రని అల్లు అర్జున్ అద్భుతంగా పండించేవాడని చెబుతున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని నా సోదరుడు ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మాణంలో తెరకెక్క బట్టే ఇంతటి విజయం సాధించిందని.... వేరే నిర్మాత అయితే ఈ సినిమా విషయంలో కొంచెం కంప్రమైజ్ కావాల్సి వచ్చేదని చెబుతున్నాడు. తన సోదరుడు వలనే తాను ఇంత కంఫర్ట్ గా ఈ సినిమా చేయగలిగామని చెప్పిన ఈయన... వేరే నిర్మాత అయితే ఈ 'అర్జున్ రెడ్డి' టీజర్, ట్రైలర్ విడుదలప్పుడే అడ్డుచెప్పేవారని.... అంటున్నాడు.

అయితే ఇదివరకే అల్లు అర్జున్ తో ఒక సినిమా చెయ్యాలనుకున్నాను... అలాగే ఒక కథ కూడా వినిపించాను. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఈ 'అర్జున్ రెడ్డి' కథను అల్లు అర్జున్ కి చెప్పడానికి ట్రై చేసినా కుదరకపోవడం వలెనే విజయ్ ని హీరోగా ఈ సినిమా చేశానని చెబుతున్నాడు 'అర్జున్ రెడ్డి 'డైరెక్టర్. అయితే అల్లు అర్జున్ తో ఇప్పట్లో సినిమా చెయ్యలేనేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాడు ఈ డైరెక్టర్. ఎందుకంటే ఆరేళ్ళ క్రితం అల్లు అర్జున్ వేరు ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ వేరంటున్నాడు. మరి స్టార్ హీరో హోదాలో ఉన్న అల్లు అర్జున్ ఈ డైరెక్టర్ గారికి ఒక్క ఛాన్స్ ఇస్తాడేమో వెయిట్ అండ్ సి.

Similar News