అర్జున్ రెడ్డి మామూలోడు కాదండోయ్

Update: 2017-08-31 04:33 GMT

ఒక సినిమాకి క్రేజ్ తీసుకురావాలంటే గనక కోట్లు ఖర్చుపెట్టి మరీ పబ్లిసిటీ చేసే ఈ రోజుల్లో ఎటువంటి డబ్బుని ఖర్చుపెట్టకుండా సినిమాకి విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు అర్జున్ రెడ్డి నిర్మాతలు. అర్జున్ రెడ్డి సినిమాకి మాత్రం వివాదాలతోనే భారీ క్రేజ్ వచ్చేసింది. ఈదెబ్బకి భారీ స్థాయిలో జనాల్లోకి అర్జున్ రెడ్డి నెగెటివ్ టాక్ తో వెళ్లడంతో అందరు ఎగబడి చూస్తున్నారు. ఇప్పుడు వసూళ్లతో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. ఇప్పటికే నెగెటివ్ పబ్లిసిటీతో దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి విడుదల అయినా ఐదు రోజులకి మరో వివాదం తెరపైకి వచ్చింది.

అదేమిటంటే అర్జున్ రెడ్డి కథను డైరెక్టర్ సందీప్ వంగా ఒకరి సినిమా నుండి కాపీ కొట్టాడని ఓ దర్శకుడు ఆరోపిస్తున్నాడు. కానీ అర్జున్ రెడ్డి సినిమాను , దర్శకుడు సందీప్ తన వ్యక్తిగత అనుభవాల ను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరక్కించాడని చెప్పుకొచ్చాడు. కై ఇప్పుడు ఇక సె..లవ్ అనే సినిమాను తెరకెక్కించిన నాగరాజు అనే దర్శకుడు, తన చిత్ర కథ ఆధారంగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారని... చిత్ర నిర్మాతకి అలాగే అర్జున్ రెడ్డి దర్శకుడికి నోటీసులు పంపాడు. మరీ అక్కడితో ఆగకుండా తన కథని కాపీ కొట్టినందుకు గాను తనకి వారిద్దరూ రెండు కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసాడు.

ఒకవేళ వారు నష్టపరిహారం గనక ఇవ్వకపోతే సినిమాని నిలిపివేయాలని కోరుతున్నాడు. ఒకవేళ చిత్ర దర్శకనిర్మాతలు ఒక వారంలోగా తనకి 2 కోట్లు సెటిల్ చెయ్యకపోతే గనక వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపారు. మరీ అర్జున్ రెడ్డి మీద జరుగుతున్న నెగెటివ్ పబ్లిసిటీ మీద హీరో విజయ్ రెచ్చిపోతూ స్పందిస్తున్నాడు. మరీ ఈ ఇష్యులో విజయ్ స్పందన, అర్జున్ రెడ్డి దర్శక నిర్మాతల స్పందన ఎలా ఉంటుందో చూద్దాం..

Similar News