అర్జున్ రెడ్డి తో మణి!

Update: 2017-09-22 13:00 GMT

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ పేరు మాములుగా మోగడంలేదు. అర్జున్ రెడ్డి తో విజయ్ అందరి డైరెక్టర్ల మైండ్ లో తిష్టవేసుకుని కూర్చున్నాడు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ జీవించాడనే విషయం తెలిసిందే. ఇక విజయ్ కు సినిమా అవకాశాలతో పాటే షాప్ ఓపెనింగ్స్ కూడా పిలిచేస్తున్నారు. ఒక వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంసిడర్ గా మారిన విజయ్ దేవరకొండ ఓపెనింగ్ కి కూడా విచ్చేసి బాగానే దండుకున్నాడనే న్యూస్ ఉండనే ఉంది. ఇక సినిమాలకు కూడా తన పారితోషకాన్ని పెంచేసాడనే న్యూస్ కూడా వినబడుతుంది.

అయితే అర్జున్ రెడ్డి తో విజయ్ దేవరకొండ ఒక లెజండరీ డైరెక్టర్ దృష్టిలో పడ్డాడట. ఆయనెవరో కాదు తమిళంలో ఒకప్పటి టాప్ డైరెక్టర్ మణి రత్నం. అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ పర్ఫార్మెన్స్ చూసిన మణిరత్నం ఫిదా అయిపోయారని తన నెక్స్ట్ చిత్రంలో అతనికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని కథనాలు ఒక వారం రోజులనుండి ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలు నిజమే అంటున్నారు. మణిరత్నం ప్రస్తుతానికి మల్టీస్టారర్ చేసే ఆలోచనలో ఉన్న ఆయన ఆ సినిమా కోసం అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక లనుసెలెక్ట్ చేసుకున్నాడు.

ఇక ఆ చిత్రం తర్వాతే మణిరత్నం, విజయ్ దేవరకొండ చిత్రాన్ని స్టార్ట్ చేస్తాడని చెబుతున్నారు. మరి ఒక దెబ్బకి విజయ్ స్టార్ మాములుగా తిరగలేదు. సుడి అంటే ఇదే కదా మరి!!

Similar News