'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని విమర్శించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో... ప్రశంసించేవాళ్ళు అంతేముంది ఉన్నారు. మొదటి నుండి వీహెచ్ 'అర్జున్ రెడ్డి' పై ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆయనకి తోడు మహిళా సంఘాలు గళం విప్పినప్పటికీ, వాళ్లు కామ్ అయ్యారు. కానీ వీహెచ్ మాత్రం ఇప్పటికి 'అర్జున్ రెడ్డి' చిత్రంపై పోరాడుతూ ప్రెస్ మీట్స్ గట్రా పెట్టేస్తున్నారు. మరోపక్క యాంకర్ అనసూయ కూడా 'అర్జున్ రెడ్డి' చిత్రం చూడకుండానే 'అర్జున్ రెడ్డి' చిత్రం గురించి ట్విట్టర్ లో యుద్ధం చేస్తుంది. అయినా ఎవరి మాటలు పట్టించుకోకుండా 'అర్జున్ రెడ్డి' తన పని తానూ చూసుకుంటుంది అది వేరే విషయం.
ఇకపోతే 'అర్జున్ రెడ్డి' సినిమా చూసాక, తెలంగాణ మంత్రి కేటీఆర్, హీరో నాని, రానా వంటివారు నటుడు విజయ్ ని పొగిడేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి కూడా 'అర్జున్ రెడ్డి' చిత్రం ఇప్పుడే చూసాను అంటూ... చాలాబాగుందని.. అర్జున్ రెడ్డి టీమ్ కి విషెస్ తెలిపాడు. ఇక ఇప్పడు తాజాగా 'అర్జున్ రెడ్డి' ని మరో టాప్ సెలెబ్రిటీ తెగ పొగిడేసాడు. ఎప్పుడూ ఎవరి నటనను, టాప్ హీరోస్ సినిమాలను చూసిన ఎటువంటి కామెంట్ చెయ్యని సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ 'అర్జున్ రెడ్డి' చిత్రం గురించి ట్విట్టర్ సాక్షిగా పొగడ్తల వర్షం కురిపించాడు.
మహేష్ బాబు 'అర్జున్ రెడ్డి' గురించి బోల్డ్ ..బ్రిలియంట్ ..ఒరిజినల్ సినిమా అంటూ... విజయ్ దేవరకొండ నటన అద్భుతం అంటూనే హీరోయిన్ షాలిని, ఆమె కి ఫ్రెండ్స్ కింద చేసిన వారికి , విజయ్ ఫ్రెండ్ కేరెక్టర్ చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశాడు. డైరెక్టర్ సందీప్ వంగాతో పాటే... 'అర్జున్ రెడ్డి' ఎంటైర్ టీమ్ కి కంగ్రాట్స్ కూడా చెప్పాడు. మరి ఒక చిత్రం గురించి మహేష్ బాబు ఇంతిలాంటి కామెంట్ చెయ్యడం మాత్రం ఇదే మొదటిసారి అంటున్నారు. మరి మహేష్ ట్వీట్స్ చూసిన 'అర్జున్ రెడ్డి' టీమ్ కాళ్ళు భూమ్మీద నిలువవేమో..!