తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాని తమిళ్ లో విక్రమ్ తన కొడుకు ధృవ్ హీరోగా రీమేక్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. విక్రమ్ కొడుకు ధ్రువ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ కోసం మేకోవర్ అయ్యే పనిలో ధృవ్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఈ రీమేక్ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు.
తెలుగులో అర్జున్ రెడ్డి గా తెరకెక్కిన ఈ సినిమాకి తమిళంలో వర్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ను స్వయంగా హీరో విక్రమ్ రిలీజ్ చేశాడు. ఈ - 4 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు వర్మ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ విషయాన్నీ మీతో పంచుకుంటుందాన్నందుకు చాలా హ్యాపీగా ఉందంటూ పోస్ట్ ఒకటి పెట్టాడు విక్రమ్.
తెలుగులో అర్జున్ రెడ్డి ని సందీప్ వంగా తెరకెక్కిస్తే.... తమిళంలో మాత్రం వర్మ సినిమాకి బాల డైరక్టర్. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇప్పటివరకు ఇదే బిగ్గెస్ట్ హిట్. మరి హీరోగా పరిచయమవుతున్న ధృవ్ కి ఈ వర్మ ఎలాంటి విజయాన్ని కట్టబెడుతుందో అనేది సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది.