అరెస్ట్ అంటున్నా భయం లేకుండా

Update: 2018-01-30 09:08 GMT

కోలీవుడ్ హీరోయిన్ అమల పాల్ రేపో మాపో అరెస్ట్ అయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో బీమా సర్టిఫికేట్స్ పొంది.. వాటితో ఖరీదైన కారును పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించి.. లక్షల కొద్దీ సొమ్ము మిగుల్చుకుంది. దీనిపై జరుగుతున్న విచారణలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ముందు తన వాదన వినిపించింది అమలాపాల్.

ఒకవైపు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా.. అమల పాల్ తన పని తాను చేస్కుంటూ వెళ్ళిపోతుంది. తన ప్రొఫెషనల్ పనుల్లో తీరిక లేకుండానే గడిపేస్తోంది. మలేషియాలో వచ్చే నెల 3వ తేదీన డాజిలింగ్ తమిళచి అంటూ ఓ భారీ ప్రోగ్రాం జరగబోతోంది. ఈ ప్రోగ్రాం కోసం అమల పాల్ డాన్స్ వేయనుంది. ప్రస్తుతం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది అమల పాల్. మొఖంలో ఎటువంటి భయం లేకుండా చాలా కూల్ గా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది.

కోలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు.

Similar News