తెలుగు ఇండస్ట్రీ కి హిట్ చిత్రాలని అందించిన నిర్మాణ సంస్థ... గీత ఆర్ట్స్. ఈ సంస్థ ప్రస్తుతం ఇండస్ట్రీలోని ఫ్లాప్ దర్శకులని ఎంకరేజ్ చేసే పనిలో పడింది. 'బొమ్మరిల్లు' వంటి హిట్ సినిమా ని తీసిన బొమ్మరిల్లు భాస్కర్ ఆ తరువాత రామ్ తో 'ఒంగోలు గిత్త' అనే మూవీ తీసి భారీ ఫ్లాప్ ని మూటగట్టుకొని.... ఆ దెబ్బకి ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోయాడు. అప్పటినుండి ఇప్పటివరకు బొమ్మరిల్లు భాస్కర్ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన హీరోగాని నిర్మాత గాని లేరు. అయితే ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ ని అల్లు అరవింద్ పిలిచి గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేసేందుకు ఛాన్స్ ఇచ్చాడనే న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేయమని త్వరలో సెట్స్ మీదకి తీసుకొని వెళ్దాం అని భాస్కర్ ని అల్లు అరవింద్ కోరినట్టు తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క ప్లాప్ డైరెక్టర్ కి మాత్రమే గీత ఆర్ట్స్ అరవింద్ బంపర్ ఆఫర్ ఇవ్వడం లేదు... మరో ప్లాప్ దర్శకుడు అయిన శ్రీకాంత్ అడ్డాల కి కూడా అరవింద్ పిలిచి ఛాన్స్ ఇచ్చాడనే న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. 'బ్రహ్మోత్సవం' రూపం లో ఒక భారీ డిజాస్టర్‌ను ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల ని కూడా మంచి స్క్రిప్ట్ తయారు చేయమని గీతా ఆర్ట్స్ అరవింద్ కోరినట్టు తెలుస్తోంది. మరి అరవింద్ ఇలా పిలిచి అవకాశం ఇచ్చాడంటే.. మాములు విషయం కాదు.
ఇలా ఫ్లాపులిచ్చిన దర్శకులని కథలు తయారు చేయమని చెప్పడంలో..... వారి చేత హిట్ సినిమాలు తీయించడం లో గీతా ఆర్ట్స్ కి పెద్ద సెటప్ ఉన్నట్టు తెలుస్తోంది. స్వతహాగా అల్లు అరవింద్ కి మంచి స్టోరీ జడ్జ్ మెంట్ ఉంది. ఇప్పుడు ఆ జడ్జ్ మెంట్ ని ఉపయోగించే ప్లాప్ దర్శకులతో సినిమాలను తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యాడట అల్లు అరవింద్.