మరొక్క 20 రోజుల్లోనే అఖిల్ - విక్రమ్ కుమార్ ల హలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలున్నాయి. అందులోను హలో టీజర్ విడుదలైనప్పటినుండి ఈ సినిమా అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే ఇప్పుడు హలో సినిమా ప్రమోషన్స్ కి శ్రీకారం చుడుతున్న టైములో చిత్ర బృందంతో పాటే.. నాగార్జునకి అనుకోని షాక్ తగిలింది. అదేమిటంటే.. అఖిల్ హలో టీజర్ ను యుట్యూబ్ నుండి లేపేసారట. మరి అలా టీజర్ ని యూట్యూబ్ నుండి లేపెయ్యడం అంటే... ఏదైనాకాపి రైట్ ఇష్యునా అనే అనుమానం వచ్చేస్తుంది ప్రతి ఒక్కరిలో.
అసలు సడన్ గా ఇలా హలో టీజర్ ని యూట్యూబ్ నుండి లేపెయ్యడానికి నిజంగానే కాపీ రైట్ ఇష్యునే కారణమట. అయ్యో నిజంగానే ఇది పరువు పోయే విషయమే. నాగార్జున హలో విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఇలా ఎలా జరిగిందబ్బా అనుకుంటున్నారా?... హలో సినిమా డిజిటల్ హక్కులను ఎవరికైనా అమ్మేస్తే వారు ఇలా కాపీ రైట్ వేసారనుకోవడానికి లేదు. ఎందుకంటే హలో డీటేల్ రైట్స్ ఇంకా నాగ్ ఎవరికీ ఇవ్వనేలేదు. అయితే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వేసిన కాపీ రైట్ తో హలో టీజర్ ని యూట్యూబ్ నుండి తీయలేదట.
అసలు విషయం ఏమంటే.. హలో టీజర్ కోసం అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశాడు అనుకుంటున్న మ్యూజిక్ అనూప్ చెయ్యనేలేదట. అసలు ఫిన్ ల్యాండ్ కు చెందిన ఎపిక్ నార్త్ అనే ఒక కంపెనీ.. టీజర్స్ కోసం ప్రత్యేకించి మ్యూజిక్ తయారుచేస్తారట. వాళ్ళెంతో క్వాలిటీగా.. సూపర్ గా కంపోజ్ చేసే మ్యూజిక్ ని ఎవరైనా కొనుక్కోవచ్చట. అలా కంపోజ్ చేసిన ఎక్సోసూట' అనే మ్యూజిక్ ను.. యాజిటీజ్ హలో టీజర్ కోసం వాడేసారట. కాని కాపీరైట్ కోసం డబ్బులు చెల్లించకుండా వాడుకుంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. అందుకే కాపీ రైట్ క్లయిమ్ వేయడంతో.. యుట్యూబ్ లో హలో టీజర్ ఎగిరిపోయింది. మరి అలా ఒకరి దగ్గర మ్యూజిక్ ని కొనకుండా వాడెయ్యడం నేరమే కదా. అసలు దీనికి నాగార్జున ఎలా ఒప్పుకున్నాడో అస్సలు అర్ధం కానీ విషయం ఇక్కడ.