అయ్యో సునీల్ విషయంలో అలా జరిగిందా?

Update: 2017-12-28 06:20 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో 25 వ మూవీ గా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా వుంది. పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ మూవీస్ ని తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ అజ్ఞాతవాసిని డైరెక్ట్ చెయ్యడంతో ఈ సినిమా మీద అటు ఫాన్స్ లోను.. ఇటు ప్రేక్షకుల లోను భారీ అంచనాలున్నాయి. వచ్చే నెల జనవరి 10 న సంక్రాతి కానుకగా రిలీజ్ అయ్యే ఈ సినిమా పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించడం, ఖుష్బూ వంటి సీనియర్ హీరోయిన్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ కావడం వంటి విషయాలతో ఈ సినిమా కి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమా లో సునీల్ కి ఒక క్యారెక్టర్ వచ్చి చేజారిందనే టాక్ నడుస్తుంది. త్రివిక్రమ్ కి మంచి స్నేహితుడైన సునీల్ హీరోగా చక్రం తిప్పలేక మళ్ళీ కామెడియన్ గా మారుతానని ప్రకటించిన క్రమంలోనే ఈ అజ్ఞాతవాసి సినిమా తెరకెక్కడంతో... త్రివిక్రమ్, సునీల్ కోసం ఒక క్యారెక్టర్ ని అనుకున్నాడట.

అయితే లాస్ట్ మినిట్ లో స్క్రిప్ట్ లో ఆ క్యారెక్టర్ సరిగ్గా సెట్ అవ్వకపోవడం…. వల్ల సునీల్ క్యారెక్టర్ ని మూవీ లో నుంచి తీసేసాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. అజ్ఞాతవాసి లో వచ్చిన అవకాశం ఎలా చేజారిందో అనే విషయాన్ని స్వయంగా సునీల్ తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా లో సునీల్ క్యారెక్టర్ ని తీసేసిన త్రివిక్రమ్ నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమాలో అయినా సునీల్ కోసం క్యారెక్టర్ రాస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటె సునీల్ హీరో గా నటించిన లేటెస్ట్ సినిమా 2 కంట్రీస్ ఈ ఏడాది చివరిలో అనగా ఈ నెల 29 న రిలీజ్ అవుతుంది.

Similar News