సాయి ధరమ్ తేజ ఈ మధ్యన ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఏదో సినిమాలు చేస్తున్నాను.. అంటే చేస్తున్నాను అన్నట్టుగా ఉన్నాయి ఈ మధ్యన సాయి సినిమాలన్నీ. అందుకే సాయి ధరమ్ తేజ ఈసారి జవాన్ సినిమా విషయంలో కాస్త గట్టిగానే వున్నాడు. అందుకే జవాన్ సినిమాబాధ్యతలను సాయి ధరం తేజ్ టాలీవుడ్ టాప్ నిర్మాత అయిన దిల్ రాజు చేతిలో పెట్టాడు. గౌరవ సమర్పకుడి బాధ్యతల్ని దిల్ రాజుకి అప్పగించేసాడు సాయి ధరమ్. ఇక ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ హిట్ అయ్యేలా చూస్తానని దిల్ రాజు కూడా సాయి కి మాటివ్వడమే కాదు... ఈ సినిమా విషయంలో తన సలహాలు తీసుకోమని కూడా కండిషన్ పెట్టాడు.
మరి దిల్ రాజు కండిషన్ కి తలొగ్గిన జవాన్ చిత్ర బృందం... ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక సతమతమవుతున్నారు. ఎందుకంటే జవాన్ సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్తయిపోయింది. కానీ ఇంతవరకు సినిమాకి విడుదలకు మోక్షం కలగడం లేదు. ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు కానీ ఇప్పటివరకు జవాన్ సినిమా విడుదల డేట్ ఇవ్వలేకపోతున్నారు మేకర్స్. కారణం మాత్రం దిల్ రాజే అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే జవాన్ సినిమా వచ్చెనవంబర్ లో గాని లేకుంటే డిసెంబెర్ లో గాని విడుదల చేస్తారో లేకుంటే వచ్చే ఏడాది ఫిబ్రవరికి జవాన్ విడుదల వెళ్లినా ఆశ్చర్యపోవక్కర్లేదనే టాక్ వినబడుతుంది.
అలాగే ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ దిల్ రాజు సలహాలు, సూచనలతో పాటే తనకి తెలిసినవారికి కూడా జవాన్ సినిమా చూపించి వారి సలహాలు సూచలను తీసుకుంటున్నాడట. మరి ఇదంతా చూస్తున్న సాయి ధరమ్ దిల్ రాజు మీదున్న నమ్మకంతో ఏం మాట్లాడలేకపోతున్నాడట. మరోపక్క జవాన్ దర్శకుడు బి.వి.ఎస్. రవి కూడా దిల్ రాజు చేసే పనులను మౌనంగా చూస్తున్నాడే గాని పల్లెత్తిమాట కూడా మాట్లాడడంలేదట. మరి ఈలెక్కన సాయి ధరమ్, దిల్ రాజుని నముకున్నందుకు ఎమన్నా ఫలితం ఉంటుందో లేదో అనేది మాత్రం జవాన్ సినిమా విడుదలను బట్టి సినిమా ఫలితాన్ని బట్టి ఉంటుంది.