సాహో చిత్రంలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా ఎవరిని సెట్ చెయ్యాలా అని చిత్ర బృందం ఎంతగానో ఆలోచించి ఆలోచించి చివరికి బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ని సెలక్ట్ చేశారు. ఇక ఈ భామ సాహో లో అడుగుపెట్టింది మొదలు తన పాత్ర సాహో లో ఎలా వుండబోతుందో అనే విషయాన్నీ కథలు కథలుగా చెబుతూనే వుంది. తనపై వచ్చే పుకార్లకు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వుంది. అయితే ప్రభాస్ పక్కన పోయి పోయి ఈ శ్రద్ద కపూర్ ని తెచ్చి పెట్టారేమిట్రా అని ప్రభాస్ అభిమానులు తెగ మొత్తుకుంటున్నారు. శ్రద్ద కపూర్ బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ కూడా కాదు. కానీ ప్రభాస్ పక్కన ఆమెను ఏ ధైర్యంతో తీసుకున్నారనే విషయాన్నీ చాలామంది చాలా అనుకున్నారు.
ఆ చిత్రం అట్టర్ ప్లాప్....
ఇక ఇపుడు తాజాగా శ్రద్ధ కపూర్ బాలీవుడ్లో హసీనా పార్కర్ చిత్రంలో టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రంలో శ్రద్ద కపూర్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ పాత్రలో నటించింది. ఇక హసీనా పార్కర్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం లో తన పాత్ర తన జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోతుందని చాలా ఆశలే పెట్టుకుంది. అలాగే నటిగా కూడా ఆమెను ఎక్కడికో తీసుకెళుతుంది శ్రద్ద కపూర్ భావించింది. కానీ అనూహ్యంగా శ్రద్ద ఎంతో ఆశపడిన హసీనా పార్కర్ చిత్రం శ్రద్ద ఆశల మీద నీళ్లు చల్లేసింది. హసీనా పార్కర్ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక సినిమా ప్లాప్ అయినా... కూడా ఆ సినిమాలో శ్రద్ద చేసిన పాత్రని కూడా క్రిటిక్స్ కామెడీ చేసేసారు.
ఇంకా నేర్చుకోవాలి.....
అసలు నటనలో శ్రద్ద ఇంకా చాలా నేర్చుకోవాలని... ఈ చిత్రంలో నటిగా శ్రద్ద ఫెయిల్ అయ్యిందంటున్నారు. మరి ఈ సినిమా ప్లాప్ తో శ్రద్ద కపూర్ నెక్స్ట్ సినిమా మీద ఎటువంటి అంచనాలు ఉండవు. ఇక సాహో చిత్రంలో ప్రభాస్ పక్కన నటించేందుకు గాను శ్రద్ద కపూర్ కి దాదాపు 4 కోట్ల పారితోషం ఇచ్చిమరీ తీసుకొచ్చారు. ఒకవేళ శ్రద్ద నటించిన హసీనా పార్కర్ హిట్ అయితే సాహో చిత్రానికి బాలీవుడ్ మంచి క్రేజ్ వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం సాహో చిత్ర టీమ్ వేసిన ప్లాన్ రివర్స్ అయ్యేలాగే కనబడుతుంది. చూద్దాం ప్రభాస్ పక్కన సాహోలో శ్రద్ద కపూర్ నటన ఎలా వుండబోతుందో.