అయ్యో అలా అనకుండా ఉండాల్సింది!!

Update: 2017-07-09 06:06 GMT

వివాదాలకు దూరంగా ఉండి తన పని తాను చేసుకుపోయే దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు మూటగట్టుకోవడమే కాకుండా చిన్న అప్రదిష్టని కూడా మీద వేసుకున్నాడు. ఎప్పుడూ చాలా సైలెంట్ గా తన పని మాత్రమే చక్కబెట్టుకునే రాజమౌళి బాహుబలి విజయంతో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శ్రీదేవి గురించి ఓపెన్ అయ్యాడు. బాహుబలిలో శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవిని సంప్రదించగా ఆమె కోరిన కోర్కెలు కు ఖంగు తిని మేము రమ్యకృష్ణ ని శివగామి పాత్రకి తీసుకున్ననట్లు ఓపెన్ గానే చెప్పేసాడు. అంతేకాకుండా శ్రీదేవి ఒప్పుకోక పోవడం మాకు మంచి జరిగిందంటూ సంచలనంగా మాట్లాడాడు.

అయితే శ్రీదేవిని రాజమౌళి చెప్పిన విషయాలమీద మీడియా వారు పదే పదే ప్రశ్నించగా శ్రీదేవి కూడా రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు ధీటుగానే సమాధానం చెప్పింది. నేను ఆ కోర్కెలు కోరలేదని రాజమౌళి తప్పుగా అర్ధం చేసుకున్నాడని... నేను అలాంటి కోర్కెలు కోరుతూ పొతే ఇప్పుడు నేను ఇలాంటి పొజిషన్ లో ఉండేదాన్ని కాదంటూ సూటిగానే రాజమౌళికి కౌంటర్ వేసిన విషయం తెలిసందే.

అయితే, ఇప్పుడు శ్రీదేవి రియాక్షన్ పై రాజమౌళి మళ్లీ స్పందించాడు. రాజమౌళి స్పందన ఎలా ఉందొ మీరే చూడండి. నేను శ్రీదేవిగారి గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అయినా మా ఇద్దరిలో ఎవ‌రి వ‌ర్షెన్ క‌రెక్ట్ మాట్లాడారు అనేది సినీజనాలు డిసైడ్ చేస్తారన్నది తన నమ్మకమని చెప్పాడు. అంతేకాకుండా ప‌బ్లిక్ ప్లాట్ ఫాంలో రెమ్మునరేషన్ గురించి చర్చించి ఉండాల్సింది కాదన్నాడు రాజమౌళి. అది తన త‌ప్పేనని.... దీనికి తాను శ్రీదేవిని క్షమాప‌ణలు కోరుతున్నానని రాజమౌళి వ్యాఖ్యానించినట్టు సమాచారం అందుతుంది.

మరి ఇక్కడ తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా ఒకవెలుగు వెలిగి అక్కడ బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసిన శ్రీదేవి... ఇప్పటికీ అతిలోక సుందరిలాగే ఒక వెలుగు వెలుగుతుంది. ఇక టాలీవుడ్ నుండి వెళ్లి బాలీవుడ్ లో చక్రం తిప్పిన శ్రీదేవిని అలా అన్నందుకు ఇప్పుడు రాజమౌళి పశ్చాత్తాపపడుతున్నాడని మాత్రం అర్ధమవుతుంది. మరి ఇంతటితో రాజమౌళి, శ్రీదేవి రెమ్యునరేషన్ వార్ కు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూద్దాం.

Similar News