అమ్మో సామాన్యురాలు కాదు

Update: 2017-08-14 13:44 GMT

మొన్నటికి మొన్న టాలీవుడ్ లెజెండ్ కె రాఘవేంద్ర రావు ని బాలీవుడ్ లో కూర్చుని మరీ సెటైర్స్ వేసిన హీరోయిన్ తాప్సి ఇప్పుడు తెలుగులో తన 'ఆనందో బ్రహ్మ' సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ లో హల్చల్ చేస్తుంది. రాఘవేంద్ర రావు ని తాను కించపరచలేదని మీడియా అలా అర్ధం చేసుకందంటూ... ఇంకా తప్పేమైనా వుంది అంటే క్షమించమంటూ క్షమాపణలు కూడా పడేసింది. మరి దక్షిణాదిలో అన్ని అందాల ఆరబోత పాత్రలే తప్ప నటనకు ప్రాధాన్యం ఉండదంటూ కామెంట్ చేసిన తాప్సి ఇప్పుడు తాజా చిత్రం 'ఆనందో బ్రహ్మ' లో అస్సలు గ్లామర్ గా కనిపించదట.

అసలు మాములుగా అయితే గ్లామరస్‌ సినిమాలు చెయ్యకూడదన్న రూల్‌ ఏమీ పెట్టుకోలేదు...... అయితే, నటిగా దక్కుతున్న విజయాలతో తన బాధ్యతను తాను మరింత బాగా తెలుసుకున్నాననీ, అందుకే చేసే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని తాప్సీ చెబుతోంది. అలాగే బాలీవుడ్ కి వెళ్లిపోయాక ఒకసారి దక్షిణాది సినిమాలను మానేద్దామనుకుందట తాప్సి. మరి తెలుగులో ఇంతవరకు సూపర్ హిట్ అందుకొని తాప్సి గ్లామరస్‌ పాత్రల్లో మళ్ళీ కన్పిస్తాను కానీ.... అయితే అలా చేయాల్సి వస్తే.. ఆ పాత్రకి గ్లామర్‌తోపాటు, యాక్టింగ్‌ చేసేందుకు అవకాశం కూడా ఉంటేనే గ్లామర్ పాత్రలు ఒప్పుకుంటానని చెబుతుంది.

అంతేలే మొన్నటిదాకా దక్షిణాది సినిమాలను చులకన చేసిన తాప్సి ఇప్పుడు తన సినిమా విడుదల కోసం ఎన్నైనా కబుర్లు చెబుతుంది అంటూ సెటైర్స్ వేస్తున్నారు సినీ లవర్స్. సౌత్ మీద పిచ్చ కామెంట్స్ చేసిన తాప్సి అబ్బే అదేం లేదు ఒక వేళా వుంది అనుకుంటే సారీ అంటూ చెప్పేసి దక్షిణాది సినిమాలో కంటిన్యూ అవడానికి చూస్తుంది. అంతేలే సినిమాలు హిట్ అవకపోయినా ఇక్కడ తెలివితేటలు బాగానే వంటపట్టించుకుంది అమ్మడు.

Similar News