నయనతార కోలీవడ్ లో టాప్ హీరోయిన్. ఆమెను తమ సినిమాలో తీసుకోవాలి అంటే నిర్మాతలు ఆమె చెప్పిన కండిషన్స్ కి తలొగ్గాల్సిందే. అలాగే ఆమె అడిగిన రెమ్యునరేషన్ కూడా సమర్పించాల్సిందే. మరి ఆమె అన్ని కండిషన్స్ కి నిర్మాతలు తలొగ్గినట్టే నిర్మాతలకు చిన్న హెల్ప్ చెయ్యాల్సి వచ్చినా ఆమె చచ్చినా చెయ్యదు. అందుకే నయనతారకి కాస్త పొగరెక్కువనే నానుడి కూడా వుంది. ఇక సినిమా షూటింగ్స్ లో మాత్రమే తనకి సంబంధం ఉండినట్టు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక సినిమా ప్రమోషన్స్ కి తనకి సంబంధం ఉండదని తేల్చి చెప్పేసే రకం నయనతారది.
ఏ సినిమా ప్రమోషన్ లోను నయనతార పాల్గొనదనే ప్రచారం ఉంది. అది కేవలం ప్రచారం మాత్రమే కాదు అది నిజం కూడా. అలాగే ఎక్కువగా మీడియా ముందు ఫోకస్ కూడా అవదు. అలాగే ఎక్కువగా సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమా ప్రమోషన్స్ కి గాని యాడ్ కంపెనీలతో బ్రాండ్ అంబాసిడర్స్ గా పని చెయ్యడానికి గాని ఇష్టపడని నయనతారకి ఖాళీ సమయాల్లో ఒక చిన్న అలవాటు ఉందట. ఆమె తన ఖాళీ సమయాల్లో కవితలు గట్రా రాస్తుంటానని రీసెంట్ గా హాజరైన ఒక సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో చెప్పుకొచ్చింది.
నయనతార ఈ మధ్య సినిమాలతో పాటే కొన్ని ప్రముఖ యాడ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తుంది. అలాగే తన తాజా చిత్రం ‘ఆరమ్’ కోసం ఇప్పుడు పబ్లిటి కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ‘ఆరమ్’లో రైతుల నీటి సమస్యపై పోరాడే ఓ బ్యూరోక్రాట్ పాత్రను చేస్తోంది నయన్ . అయితే నయనతార ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకంగా రూ.40 లక్షల దాకా పారితోషకం అందుకుంది. సినిమా పారితోషం అటుంచి కేవలం సినిమా ప్రమోషన్ కోసమే 40 లక్షలు వసూలు చేసిందంటే నయన్ మామూలుది కాదు బాబోయ్ అంటున్నారు. ఇక 40 లక్షలు అందుకున్న నయన్ మీడియా వాళ్ళకిఇంటర్వ్యూ గట్రా ఇస్తూ బిజీగా వుంది.