అమ్మడుకి హైదరాబాదే నచ్చిందట

Update: 2017-11-06 09:00 GMT

మలయాళం నుండి వచ్చి తెలుగు సినిమాలు చేస్తుంది అను ఇమ్మాన్యుయేల్. ఇప్పటికే తెలుగులో నటించిన సినిమాల్తో మంచి పేరు కూడా వచ్చింది. లేటెస్ట్ గా ఓ తమిళ్ సినిమా కూడా చేసింది. అటు మలయాళం ఇటు తమిళం కన్నాతనకి టాలీవుడ్ అంటేనే ఇష్టమని చెబుతుంది ఈ ముద్దు గుమ్మ. అన్ని అనుకున్నట్టు జరిగితే నేను హైదరాబాద్ లోనే సెటిల్ అవుతానంటుంది.

నాకు టాలీవుడ్ బాగా నచ్చింది... అందుకే నేను ఇక్కడే సినిమాలు చేస్తా అంటుంది అను. మళ్లీ మలయాళం ఇండస్ట్రీకి వెళ్లే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. మరి తమిళ సినిమా చేయడం వెనక రీజన్ ఏంటనే ప్రశ్నకు... కేవలం రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వడం వల్లనే కోలీవుడ్ లో సినిమా చేశానని ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పుకొచ్చింది అను ఎమ్మాన్యుయేల్.

నేను ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. ఓ పెద్ద కారు కొనుక్కోవాలి. హైదరాబాద్ లోనే ప్రస్తుతం ఓ ఫ్లాట్ లో ఉంటున్నాను. కానీ దానికంటే పెద్ద ఇల్లు ఒకటి కొనుక్కోవాలి. ప్రస్తుతానికైతే ఈ రెండే నా టార్గెట్స్. ఇకపై నేను అలాంటి ఇలాంటి సినిమాలు చేయను. క్రేజ్ ని బట్టే సినిమాలు చేస్తా అని చెబుతుంది. తమిళ్ లో ఆమె నటించిన తుప్పరివాలన్ సినిమా తెలుగులో డిటెక్టివ్ పేరిట విడుదలకు సిద్ధమైంది.

Similar News