అమ్మడుకి గట్టి ఆఫర్ తగిలింది

Update: 2017-09-11 09:29 GMT

అలనాటి మహానటి సావిత్రి బయోపిక్ ని అశ్వినీదత్ అల్లుడు, 'ఎవడె సుబ్రహ్మణ్యం' దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్నఈ సినిమాకి 'మహానటి' అనే టైటిల్ ని పెట్టారు. మహానటి తగ్గట్టే మహా మహా నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి రోల్ ని పోషిస్తుంది. ఆమె ప్రియుడు, భర్త జెమిని గణేషన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో సమంతా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలోకి ఇంకో నటి వచ్చి చేరింది.

'అర్జున్ రెడ్డి' సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరైన షాలిని పాండే 'మహానటి'లో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. ఆమె నటించిన 'అర్జున్ రెడ్డి' మూవీ ఇటివలే విడుదలై సంచలన విజయం సాధించింది. 4 కోట్లతో రూపొందిన ఈ సినిమా 40 కోట్లని వసూలు చేసే దిశగా పరుగులు పెడుతుంది. ఈ సినిమా హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, షాలిని పాండేల నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది అని విమర్శకులు మెచ్చుకుంటున్నారు.

అయితే 'అర్జున్ రెడ్డి' సినిమాలో షాలిని పాండే నటన నచ్చి దర్శకుడు నాగ్ అశ్విన్ 'మహానటి' కోసం ఆమెని తీసుకొన్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఒక కీ రోల్ లో నటిస్తున్నాడు. వచ్చే యేడాది 'మహానటి' సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి ట్రై చేస్తున్నారు చిత్ర బృందం.

Similar News