అమ్మడు మరో తెలుగు సినిమాకి ఓకె చెప్పింది

Update: 2017-09-02 07:41 GMT

వెంకటేష్ హీరోగా తెరకెక్కిన 'గురు' చిత్రంలో రాముడుగా ఇరగదీసిన రితిక సింగ్ ఇప్పటివరకు మారే ఇతర తెలుగు ప్రాజెక్ట్ ని ఓకె చెయ్యలేదు. 'గురు' చిత్రంలో రితిక సింగ్ రాముడు పాత్రలో బాక్సర్ గా చేసిన పెరఫార్మెన్సు కి తెలుగు ప్రేక్షుకులు ఫిదా అయిపోయారు. 100 కి 100 శాతం మార్కులు కొట్టేసిన రితిక సింగ్ 'గురు' చిత్రం తర్వాత లారెన్స్ హీరోగా వచ్చిన శివలింగా డబ్బింగ్ సినిమాతో అలరించింది. ఆ సినిమా విడుదలై మంచి విజయం సాధించినప్పటికీ రితిక్ సింగ్ మరో తెలుగు సినిమా ఇప్పటివరకు ఒప్పుకోలేదు. తనకి స్టోరీ నచ్చితేనే సినిమా చేస్తానని భీష్మించుకు కూర్చున్న రితిక ఇప్పుడు తాజాగా ఆమె ఒక తెలుగు మూవీకి సైన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

రాజశేఖర్ అనే డెబ్యూ డైరెక్టర్ డైరెక్షన్ లో సుధీర్‌బాబు హీరోగా వస్తున్న సినిమాలో రితిక సింగ్ ని హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఓ డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కబోయే ఈ ప్రాజెక్టులో ఆమె క్యారెక్టర్ స్పెషల్‌గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ‘గురు’ తర్వాత తెలుగులో చాలా ఆఫర్లు వచ్చినా సుధీర్‌బాబు సినిమా కథ... అందులోని తన పాత్ర నచ్చడంతోనే ఇప్పుడు ఈ ప్రాజెక్టు కు రితిక ఓకే చెప్పిందంటున్నారు. మరి సుధీర్ బాబు తో రితిక సింగ్ పెరఫార్మెన్సు ఎలా వుండబోతుందో అంటూ అప్పుడే డిస్కషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.

Similar News