అమ్మడు బాలీవుడ్ కి వెళ్లదట

Update: 2017-11-28 08:00 GMT

అదేమిటి హీరోయిన్స్ అందరికి బాలీవుడ్ వెళ్లాలని.. అక్కడ ఒక వెలుగు వెలగాలని ఉంటుంది. అసలు అలాంటి కలలు లేని సౌత్ హీరోయిన్ ఉందంటే నమ్మశక్యంగానే ఉండదు. అయితే ఇపుడు టాలీవుడ్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మెహ్రీన్ కౌర్ మాత్రం బాలీవుడ్ కి వెల్లనంటే వెళ్లనంటుంది. ఇప్పటికే కృష్ణగాడి వీరప్రేమ గాద, మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాల్తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నమెహ్రీన్.... సన్ ఆఫ్ సూర్య తో కాస్త డల్ అయినా... ఇప్పుడు సాయి ధరమ్ సరసన నటించిన జవాన్ సినిమా ఫలితం కోసం ఎదురు చూస్తుంది.

అయితే ఈ భామ బాలీవుడ్ కన్నా టాలీవుడ్ సూపర్ అంటుంది. తెలుగు సినిమాలకన్నా బాలీవుడ్ సినిమాలేమి గొప్ప కాదంటుంది. అసలయితే తెలుగు సినిమా అనేది దేశంలోనే నంబర్‌వన్‌ ప్లేస్ లో ఉందని.. అందుకే తాను తెలుగులోనే సినిమాలు చేస్తానని ఎటువంటి మొహమాటం లేకుండా చెబుతుంది. ఇకపోతే తెలుగు సినిమాల్లో నటిస్తున్నందుకు తాను గర్వంగా చెప్పుకుంటానని మెహ్రీన్ కౌర్ చెబుతున్నమాట. అయినా సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్, టాలీవుడ్ అంటూ వేరు చేసి మాట్లాడకూడదని చెబుతుంది. అలాగే.. కృష్ణగాడి సినిమాలో నటిస్తునప్పుడే... సాయి ధరమ్ - రవిల జవాన్ సినిమాకి సైన్ చేశానని చెబుతుంది.

అయితే జవాన్ సినిమాకి సైన్ చెయ్యడమైతే చేశానుగాని.. అప్పటికి ఆ సినిమా స్క్రిప్ట్ కూడా తెలియదని చెబుతూన్న ఈభామ... కేవలం దర్శకుడు బి.వి.ఎస్.రవి తన మీద పెట్టిన నమ్మకం చూసి మాత్రమే ఈ సినిమా ఓకే చేశానని.. అందుకే సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది. మరి రవి మీద నమ్మకంతోనే జవాన్ లో నటించిన మెహ్రీన్ కి ఆ సినిమా ఎలాంటి ఫలితం ఇవ్వబోతుందో... అనేది వచ్చే శుక్రవారం వరకు ఆగితే తెలిసిపోతుంది.

Similar News