అమ్మడు కు బన్నీ సపోర్ట్?

Update: 2017-12-13 13:00 GMT

ఇద్దరమ్మాయిలు సినిమా టైమ్ లో బన్నీకి క్యాథరీన్ తెగ నచ్చేసింది. తన గురించి పొగిడిన సందర్భాలు లేక పోలేదు. బన్నీకి ఈ అమ్మడు బాగా నచ్చడంతో వేరే సినిమా ఆఫర్స్ కూడా ఇపించాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకూండా బన్నీ కేథరిన్ కి సరైనోడులో యంగ్ ఎమ్యెల్యే గా కూడా ఛాన్స్ ఇచ్చాడు. అలానే మళ్ళీ ఇప్పుడు బన్నీకి ఆ రేంజ్ లో అను ఎమ్మాన్యుయేల్ నచ్చిందట.

వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బన్నీకి జోడిగా అను ఇమ్మాన్యువల్ నటిస్తుంది. ఈ సినిమాలో అను యాక్టింగ్, నడవడిక బన్నీకి బాగా నచ్చాయట. అందుకే వేరే సినిమాల్లో అను ఇమ్మాన్యువల్ ని రికమండ్ చేస్తున్నాడని టాక్.

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది అను. పవన్, బన్నీ సినిమాలలో నటించిన ఈ అమ్మడు నాగ చైతన్య, రామ్ చరణ్ సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసి టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది.

Similar News