'అ... ఆ, ప్రేమమ్, శతమానం భవతి' వంటి హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి స్టార్ హీరోల పక్కన ఛాన్స్ మాత్రం దొరకలేదు. కానీ యంగ్ హీరోల పక్కన ఛాన్స్ లు కొట్టేస్తూ బాగా బిజీ అయ్యింది. అవార్డుతో పాటు రివార్డులు కూడా పొందిన 'శతమానం భవతి'లో దిల్‌రాజు ప్రొడక్షన్‌లో శర్వానంద్ సరసన నటించి లక్కీ హీరోయిన్ అనిపించుకున్న అనుపమ..... ప్రస్తుతం రామ్ సరసన ' ఉన్నది ఒకటే జిందగీ', నాగచైతన్యతో ఓ చిత్రం, నాని - మేర్లపాక గాంధీల 'కృష్ణార్జున యుద్దం'తో పాటు తమిళ్, మలయాళం చిత్రాలలో నటిస్తోంది.
ఇన్ని సినిమాలు చేతిలో ఉండగానే ఇప్పుడు మరో అదృష్టం ఆమెని వరించింది. ఈ భామ మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. రామ్‌తో ఓ ప్రేమకదా చిత్రం తీయాలని లవ్‌స్టోరీస్ స్పెషలిస్ట్ కరుణాకరన్ ఓ వినూత్నప్రేమకథను తయారు చేసుకున్నాడు. కానీ 'ఎందుకంటే ప్రేమంట' వంటి ఫెయిల్యూర్‌ని ఇచ్చిన కరుణాకరణ్ కి.... రామ్ చివరి వరకు ఓకే అని చివరి నిమిషంలో పక్కనపెట్టాడు. దాంతో అదే కథకు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆయన మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌కి వినిపించి... ఓకె చేయించుకున్నాడు.
సాయి ధరమ్ తేజ్ ని కరుణాకరణ్ తొలిసారిగా లవర్‌బోయ్ ఇమేజ్‌తో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ పాత్రకు మలయాళ కుట్టి.... 'ప్రేమమ్' బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ని ఎంచుకున్నారు. సాదారణంగా కరుణాకరన్ ట్రాక్ రికార్డును బట్టి చూస్తే ఓ హిట్ రెండు ఫ్లాప్‌లన్నట్లుగా ఆయన స్థితి ఉంటుంది. మినిమం గ్యారంటీ ఉన్న దర్శకునిగా ఈయనను చెప్పుకోలేం. మరి ఈయన సాయిధరమ్‌తేజ్‌ని, అనుపమ పరమేశ్వరన్‌లకు ఎలాంటి హిట్‌ని అందిస్తాడో వేచిచూడాల్సివుంది.