అమీర్ తో ఆ హీరోయిన్ కలిసి నటిస్తే..

Update: 2017-09-09 10:27 GMT

బాలీవుడ్ లో ప్రముఖుల జీవిత గాధను తెరెక్కించే ట్రెండ్ బాగా నడుస్తుంది. బయో పిక్స్ ని తెరకెక్కించడమే కాదు వాటితో అదిరిపోయే విజయాలను సొంతం చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.. ఇక ఆ బయో పిక్స్ లో నటించడానికి బాలీవుడ్ లో టాప్ నటీనటులు కూడా ఏమాత్రం జంకడం లేదు. ఆ సినిమాలతో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకుంటున్నారు వారు. ఇప్పుడు తాజాగా ప్రఖ్యాత భారత ఆస్ట్రోనాట్‌ రాకేశ్‌ శర్మ జీవితం ఆధారంగా తెరక్కెనున్న చిత్రం పేరు 'సారే జహాసె అచ్చా'. ఈ బయోపిక్‌లో లీడ్‌ రోల్‌ ని విలక్షణ నటుడు అమీర్‌ ఖాన్‌ పోషిస్తున్నాడు.

అయితే ఈ చిత్రంలో ప్రియాంకచోప్రా కూడా నటించనుందనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటి వరకు అమీర్‌ఖాన్‌ నటించిన సినిమాల్లో ఎప్పుడూ ప్రియాంకా చోప్రా, అమీర్ తో జత కట్టకపోవడం వలన, ఇపుడు ఈ చిత్రంలో గనక కలిసి నటిస్తే... వీరిద్దరి కాంబినేషన్‌ సినిమాకు స్పెషల్‌ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇటు అమీర్‌ ఖాన్ నుంచి గానీ... అటు ప్రియాంక చోప్రా నుంచి గానీ ఎటువంటి క్లారిటీ రాలేదు. మరో వైపు ఈ చిత్రంపై బాలీవుడ్‌లో క్యూరియాసిటీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

అసలు రాకేశ్‌ శర్మ నిజ జీవితంలో ఎలా ఉండేవాడు.. ఎటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు అనే విషయం తెలుసుకోవాలని బాలీవుడ్ ప్రేక్షకులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మొదట్లో ఈ చిత్రానికి 'సెల్యూట్‌' అనే టైటిల్‌ అనుకున్నారు. కానీ తర్వాత దాన్ని మార్చి 'సారే జహాసె అచ్చా' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు దర్శక నిర్మాతలు.

Similar News