అబ్బో చరణ్ పెద్దరికం మాములుగా లేదు

Update: 2017-09-03 08:23 GMT

మెగా ఫ్యామిలి ఉన్న గొడవలు అప్పుడప్పుడు సెటిల్ అవుతూనే ఉన్నాయి. అంతర్గత కలహాలైతే ఉన్నప్పటికీ కొన్నిసార్లు మాత్రం ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉంటుంటారు. ఇక మెగా ఫ్యామిలి లో పవన్ కేరెక్టర్ కొంచెం తేడాగా ఉంటుంది. ఎన్నున్నా కొన్నిసార్లు సర్దుకుంటాడు. మరికొన్నిసార్లు మాత్రం నా ఇష్టం అన్నట్లు ఉంటాడు. అన్నా వదినాలంటే ఇష్టమంటాడు కానీ వాళ్ళ ఫంక్షన్స్ కి పెద్దగా అటెండ్ అవాడు. అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళ మధ్య సఖ్యత బాగానే ఉన్నట్టుండి. ఎందుకంటే పవన్ బర్త్ డే కి పవన్, చిరు ఇంటికి వెళ్లడం అక్కడ తన అన్నతో, చిరు చిన్నల్లుడు కళ్యాణ్ తో ఫోటోలు దిగడం వంటివి చేస్తే.... చిరు ఏమో భార్య సురేఖని తీసుకుని పవన్ పుట్టినరోజు సందర్భంగా పవన్ చిత్ర షూటింగ్ స్పాట్ కి వెళ్లడం చూస్తుంటే విభేదాలు లేవనిపిస్తుంది.

అలాగే రామ్ చరణ్ కూడా తన బాబాయ్ పవన్ కి సోషల్ మీడియా సాక్షిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. చరణ్ తన తండ్రి తో తాను దిగిన ఫోటో పక్కన పవన కళ్యాణ్ తో చిరు దిగిన ఓ ఫోటోను ఫేస్‌బుక్‌ లో పోస్ట్ చేస్తూ ఈ విధంగా స్పందించాడు. ‘మీరు బాబాయి కావడం నా లక్ అని చెప్పడం కూడా తక్కువే అవుతుంది. అలాగే మీ అబ్బాయిగా నేను హ్యాపీగా ఉన్నా.. అదృష్టం, ఆశీర్వాదం పొందిన భావనతో ఉన్నా. మీ నుంచి నిజాయతీగా, సింపుల్‌గా ఉండటం వంటి విషయాలను గురించి తెలుసుకొని నేర్చుకున్నా… దానితో పాటు మనసులో ఉన్న భావనలనే మాట్లాడటం నేర్చుకున్నా. లక్షల మందిలో మీరొక వినయపూర్వకమైన వ్యక్తని నిజంగా నమ్ముతున్నా. పవర్‌.. పవర్‌.. సింప్లిసిటీ, హ్యుమానిటీలో ఉంది హ్యాపీ బర్త్అ డే బాబాయ్ అంటూ చరణ్ పోస్ట్ చేయడం చూస్తుంటే మాత్రం పవన్ అంటే మెగా ఫ్యామిలీకి ఎంతగా ప్రేమ ఉందొ అర్ధమవుతుంది.

ఇక చరణ్ చేసిన పోస్ట్ చూసిన మెగా ఫాన్స్ ఆనందానికి అవధులే లేవు. ఇక మొదట్లో ఎలా ఉన్న మా మధ్యన ఉన్న తత్సంబందాలు ఇప్పుడు ఏ డోఖా లేవని చరణ్ స్పష్టం చేసేసాడు.

Similar News