అబ్బో గురు శిష్యులు భలే ఎంజాయ్ చేశారు

Update: 2017-11-26 12:00 GMT

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రియ శిష్యుడు పూరి జగన్నాధ్ అనే విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మకి పూరి జగన్నాధ్ ఫుల్ సపోర్ట్ చేస్తుంటాడు. ఇక పూరి కి అన్నివిధాలా సహాయపడే మాజీ హీరోయిన్ ఛార్మి. ఈ వీకెండ్ లో వర్మ, పూరి పార్టీ చేసుకుంటూ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వర్మ, పూరి మందు కొడుతూ స్నాక్స్ తింటూ పార్టీ ని ఎంజాయ్ చేస్తూనే... మరో పక్క మ్యూజిక్ సిట్టింగ్స్ లో డీప్ గా ఇన్వాల్వ్ అయ్యారని తెలిపే వీడియో ని ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ, నాగార్జున తో తీసే యాక్షన్ సినిమాతో బిజీగా ఉంటూ హైదరాబాద్ లో మకాం వేసాడు. నాగార్జునతో తియ్యబోయే సినిమాలో రొమాంటిక్ సాంగ్స్ లేకపోయినా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోపాటు ఒకటో రెండో పాటలుంటాయనే టాక్ ఉంది. అలాగే పూరి జగన్నాధ్, ఛార్మీలు ఆకాష్ హీరోగా చేస్తున్న మెహబూబా సినిమా హిమాచల్ షెడ్యూల్ ని ముగించుకుని ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ బిజీగా వున్నారు.

వీడియో లో వర్మ డీప్ గా మ్యూజిక్ ని ఆస్వాదిస్తుంటే.. పూరి ఎదురుగా మందు గ్లాసుతో మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక వర్మ, పూరి ఎంజాయ్ చేస్తుంటే... దాన్ని వీడియో షూట్ చేసి మరి ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Similar News