అబ్బాయితో అయిపోయి ఇప్పుడు బాబాయితో

Update: 2018-01-14 07:49 GMT

లక్ష్మి కళ్యాణం చిత్రం తో వెండితెరకి పరిచయమైన అందాల కథానాయిక కాజల్ అగర్వాల్ కృష్ణ వంశి దర్శకత్వంలో నటించిన చందమామ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి బాగా చేరువై ఇప్పటికి కూడా టాలీవుడ్ చందమామ గానే పిలవబడుతూ యంగ్ హీరోయిన్స్ తో కూడా పోటీ పడుతోంది. ఫామ్లో ఉన్న రోజులలో యూత్ స్టార్ హీరోస్ అందరిని కవర్ చేసిన కాజల్ అగర్వాల్ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవి లతో కూడా నటించేసింది. కాగా తనకి తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు తేజ వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాలంలో కూడా ఆయన అడిగిన వెంటనే 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో ప్రధాన కథానాయికగా నటించి ఆ చిత్ర విజయంలో తన వంతు పాత్ర పోషించింది మన టాలీవుడ్ చందమామ.

నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా దగ్గుబాటి తో కలిసి తెరని పంచుకున్న కాజల్ అగర్వాల్ మరొకసారి తన ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ తేజ దర్శకత్వం వహించబోయే చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన కథానాయికగా కనిపించనుంది. మరో వైపు అన్ని ప్రముఖ టాలీవుడ్ ఫ్యామిలీస్ హీరోలతో నటించేసిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు తన పొజిషన్ ని సరిగ్గా అంచనా వేసుకుని బెట్టు పోకుండా పారితోషికం విషయంలో నిర్మాతలకి అందుబాటులోకి వచ్చి చిన్న బడ్జెట్ చిత్రాలలో కూడా నటిస్తోంది. ఒక వైపు మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఎం.ఎల్.ఏ లో నటిస్తూనే మరో వైపు నాని నిర్మిస్తున్న 'అ' చిత్రంలో కీలక పాత్రధారిగా కనిపించనుంది. చూస్తుంటే మరి కొంత కాలం, లో బడ్జెట్ టు మీడియం బడ్జెట్ సినిమాలతో కాజల్ ప్రేక్షకులకి చేరువగానే ఉండేలా వుంది.

Similar News