అబ్బా.. సస్పెన్సు లో పెట్టేసిందే!

Update: 2017-10-24 11:00 GMT

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ మీడియాలలో హీరోయిన్ ఇలియానా సీక్రెట్ పెళ్లి అనే హాట్ టాపిక్ నడుస్తుంది. ఇలియానా ఎవరికీ తెలియాకుండా సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూని పెళ్లాడిందనే న్యూస్ హైలెట్ అయ్యింది. ఇలియానా... ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ఎప్పటినుండో ప్రేమలో ఉందనే విషయం స్వయంగా ఇలియానా నే చెప్పింది. గత కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని మొగుడు పెళ్లాలులా కలిసి తిరుగుతున్నా ఇలియానా, ఆండ్రూ ఎప్పటినుండో మీడియాలో నానుతున్నారు.

అయితే ఇప్పుడు ఆ ప్రేమ సీక్రెట్ పెళ్ళికి దారి తీసిందని... కానీ ఎవరికీ తెలియకుండానే వీరిరువు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారని న్యూస్ మాత్రం సోషల్ మీడియా సాక్షిగా హల్చల్ చేస్తుంది. ఎప్పటినుండో సహజీవనం చేస్తున్న ఈ జంట పెళ్లి పేరుతొ ఒక్కటవడం పెద్ద విషయం కాకపోయినా.. ఆ పెళ్లి విషయాన్నీ ఇలా సీక్రెట్ గా వుంచేసరికి మాత్రం ఎక్కడలేని పుకార్లు ఇలియానా - ఆండ్రూ ల గురించి షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ న్యూస్ అసలు బయటికెలా వచ్చింది అంటే... ఇలియానా ఈ మధ్యన ఆండ్రూ సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లొచ్చిందట .

మరి ఇలియానా ఆస్ట్రేలియా వెళ్లొచ్చాక ఆమె మాటల్లో, చేతల్లో చాలా తేడా రావడమే కాకా... ఆండ్రూ ఇప్పుడు మా ఇంట్లో మనిషంటూ ఇలియానా ఇస్తున్న స్టేట్ మెంట్స్ చూసి మీడియా మొత్తం ఇలియానా కి ఆండ్రూ పెళ్లి జరిగినట్టుగా ఫిక్స్ అయ్యారు. ఇక ఆండ్రూ తన గర్ల్ ఫ్రెండ్ ఇలియానాని స్నేహితులు, బంధువులు సమక్షంలో ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకున్నాడంటున్నారు. ఇక ఇలియానా పెళ్లి వార్తలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లో ఉన్నప్పటికీ ఇలియానా మాత్రం ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టకుండా.... క్లారిటీ మాత్రం ఇవ్వకుండా సస్పెన్సు పెట్టి చంపేస్తుంది.

Similar News