సమంత మరి కొద్దీ రోజులో తన ఇంటిపేరును మార్చుకోబోతుంది. నాగ చైతన్య ని పెళ్ళాడి అక్కినేని ఇంట కాలు పెట్టబోతోంది. ఈ ఏడాది మొదట్లోనే సమంత - నాగ్ చైతన్య ల ఎంగేజ్మెంట్ జరిగింది. వచ్చే అక్టోబర్ 6 న గోవాలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగబోతుంది. మరి తన ఇంటిపేరును అక్కినేని గా మార్చుకోబోతున్న సమంత అప్పుడే ఆ ఫామిలీ లో ఒక మెంబర్ గా కలిసిపోయింది. ఇప్పటికే నాగ్ సర్ అంటూ పిలిచే సామ్ ఇపుడు నాగ్ మామ అంటూ వరుసలు పెడుతూ పిలవడం, అఖిల్ ని మరిదిగా చెప్పడం, అత్తగారు అమలతో ఎంతో క్లోజ్ గా మూవ్ అవడం చూస్తుంటే సమంత తన అత్తింటిలో త్వరగానే కలిసిపోయేలా వుంది.
కేవలం అలా అక్కినేని ఇంటితోనే సంబంధాలు మైంటైన్ చేయడంలేదు సమంత, అటు దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీతో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఆ ఫ్యామిలిలో కూడా త్వరగానే కలిసిపోయింది. నాగ చైతన్య అమ్మమ్మ చీరని తన పెళ్ళికి కట్టుకోవడం దగ్గరనుండి అన్ని విషయాల్లో బాగా కలిసిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా వరుసకు అన్న అవుతున్న రానా సినిమాని ప్రమోట్ చేసే పనిలో పడింది. దగ్గుబాటి రానా 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలోని రానా కటౌట్‌ను ట్వీట్ చేసింది. ‘అదిగో నా సూపర్‌స్టార్ అన్నయ్య’ అంటూ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన రానా భారీ కటౌట్ ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. 'నేనే రాజు నేనే మంత్రి' ఫస్ట్‌డే ఫస్ట్ షో ఆగస్టు 11 అని ఆ పోస్ట్‌కు హ్యాష్‌ట్యాగ్స్‌ను కూడా జతచేసింది సమంత.
మొత్తానికి ఇలా రాణా కటౌట్ ని పోస్ట్ చేస్తూ 'నేనే రాజు - నేనే మంత్రి' ని భలేగా ప్రమోట్ చేసింది కదా సమంత. ఇక రానా - కాజల్ - కేథరిన్ లు నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం రేపు శుక్రవారమే విడుదల కానుంది