అప్పుడే మొదలెట్టిసింది

Update: 2017-08-23 03:36 GMT

మహేష్ గారాల పట్టి సితార కి సినిమా పాటలకి డాన్స్ చెయ్యడం అంటే చాలా ఇష్టం. అందులోను సితార తల్లి తండ్రులు మహేష్, నమ్రతలు ఇద్దరూ యాక్టర్స్ కావడం వలెనే ... ఆ జీన్స్ తో పుట్టిన సితారకు ఆటోమాటిక్ గా అవే లక్షణాలు అబ్బాయి. మహేష్ కొడుకు గౌతమ్ కన్నా ఎంతో ఎక్సట్రావెర్ట్ గా వుండే సితార ఎప్పుడు తన తండ్రి నటించిన సినిమాలోని పాటలతో, డాన్స్ లతో హడావిడి చేస్తూ ఉంటుంది. ఇకపోతే మహేష్ చిన్నప్పటినుండే సినిమాల్లో నటించడంతో తన కొడుకు గౌతమ్ ని కూడా '1 నేనొక్కడినే' లో తన చిన్న నాటి పాత్ర చేయించాడు మహేష్. కానీ సితారని అలా చిన్నప్పుడే సినిమాల్లోకి తీసుకొస్తాడో లేదో మాత్రం తెలియదుగాని ఇప్పుడు సితార చక్కాగా స్కూల్ కి వెళ్లి బుద్దిగా చదువుకుంటుంది.

అయితే ఆడపిల్లలందరూ చిన్నప్పుడే ఏదో ఒక కళల్లో నిష్ణాతులవుతున్నారు. బ్యాట్మెంటన్, కరాటే, కూచిపూడి, భరత నాట్యం ఇలా అనేక రంగాల్లో పిల్లలు చిన్నప్పటినుండి దూసుకుపోతున్నారు. మరి నటన ఫ్యామిలీ నుండి వచ్చిన మహేష్ వైఫ్ నమ్రత ఎందుకూరుకుంటుంది చెప్పండి. అందుకే తన కూతురు సితారకి భరత నాట్యం నేర్పించాడనికి రెడీ అయ్యింది. హైదారబాద్ లోని ఒక పాపులర్ నృత్యకారిణి దగ్గర ఇప్పుడు సితార భరతనాట్యం నేర్చుకుంటోంది. చాలామంది ట్రెడిషనల్ డ్యాన్సర్లకు గురువు అయిన అరుణ భిక్షు మరియు ఆమె కూతురు మహతి భిక్షు దగ్గర ఇప్పుడు సితార డ్యాన్సు నేర్చుకోవడానికి రెడీ అయిపోయింది.

మరి నమ్రత ఇలా సితారకు డాన్స్ గట్రా నేర్పించడం చూస్తుంటే ఇప్పటినుండే సితారను నటనలోకి తీసుకొచ్చేందుకు అనుకూలంగా మార్చుతుందా అనే డౌట్ వస్తుంది. కానీ సితార యాక్టీవ్ నెస్ చూస్తుంటే మాత్రం ఈ డాన్స్ సితారకి ఇష్టముండే నేర్చుకుంటుందని అనుకోవాలి. మరి ఇంట్లో ఎప్పుడూ తన తండ్రి మహేష్ పాటలకే స్టెప్స్ వేసే సితార ఇప్పుడు ఇలా డాన్స్ నేర్చుకుని రేపు పెద్దయ్యాక ఇంకెన్ని విద్యలు నేర్చుకుంటుందో చూద్దాం.

Similar News