అప్పుడే బిజినెస్ మొదలెట్టేసింది

Update: 2017-08-22 11:00 GMT

మహేష్ బాబు 'స్పైడర్' సినిమా విడుదల కాకముందే కొరటాల శివ డైరెక్షన్ లో 'భరత్ అను నేను' సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల లక్నో పరిసర ప్రాంతాల్లో జరుపుకోవాల్సిన షూటింగ్ కి పేకప్ చెప్పేసి తిరిగి హైదరాబాద్ కి వచ్చేసింది. ఇక్కడ కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్నాక చిత్ర యూనిట్ విదేశాలకు పయనమవుతుందని సమాచారం. ఎప్పుడూ లేనిది మహేష్ ఈసారి చాలా స్పీడు పెంచేసాడు. వరసబెట్టి సినిమాలని లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు.

అయితే ఇంకా షూటింగ్ స్టార్టింగ్ స్టేజి లోనే ఉన్న ఈ 'భరత్ అను నేను' అప్పుడే రికార్డు స్థాయిలో బిజినెస్ మొదలెట్టినట్లు వార్తలొస్తున్నాయి. మహేష్ సినిమా హక్కుల కోసం భారీగా పోటీపడే డిస్ట్రిబ్యూటర్స్ ఆయన గత సినిమా ప్లాపులను లెక్కచెయ్యకుండా తాజా సినిమాల బిజినెస్ కి ధర పెట్టేస్తుంటారు. మహేష్ సినిమాల హిందీ హక్కులకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' హిందీ డబ్బింగ్ రైట్స్ ని ఏ.ఏ ఫిలిమ్స్ వారు దాదాపు రూ. 24 కోట్లు పెట్టి తీసుకున్నారు.

అయితే ఇప్పుడు మహేష్ తాజా చిత్రం 'భరత్ అను నేను' సినిమా హిందీ హక్కులుకూడా దాదాపు 16 కోట్లకు అమ్ముడైనట్లు టాక్ వినబడుతుంది. అయితే ఈ విషయంలో చిత్ర యూనిట్ దగ్గర నుండి క్లారిటీ రావాల్సి వుంది. మరి కొరటాల - మహేష్ కాంబో మీద ఉన్న క్రేజ్ వలెనే ఈ చిత్రానికి ఇంత భారీ మొత్తం వచ్చిందని అంటున్నారు. ఇకపోతే ఈచిత్రంలో మహేష్ కి జోడిగా బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తుండగా... దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Similar News