భారీ బడ్జెట్ భారీగా తెరకెక్కిన పద్మావత్ చిత్రం భారీ వివాదాల నడుమ భారీగా విడుదలైంది. అలా గత నెలలో భారీ థియేటర్స్ లో విడుదలైన పద్మావత్ చిత్రం భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ బాక్సాఫీసుని డదడలాడించేస్తుంది. దీపికా పదుకొనె పద్మావత్ లుక్స్ కి , ఆమె నటనకు, అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో నటించిన రణ్వీర్ నటనకు ప్రేక్షకులు ముగ్దులైపోతున్నారు. గత నెల 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపుగా 265 కోట్ల వసూళ్లను రాబట్టి 300 కోట్ల మార్కుకు చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది.
అన్ని రాష్ట్రాల్లో విడుదలకాక....
సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పద్మవత్ చిత్రం తొలినాడు ఇండియా లోని అన్ని రాష్ట్రాల్లోనూ విడుదల కాలేదు. పద్మావత్ చిత్రాన్ని అడ్డుకుంటూ రాజ్‌పుత్ కర్ణిసేన మొదలగువారు సృష్టించిన అలజడి వలన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో విడుదల కాకపోయినా మొదటి వారంలోనే పద్మావత్ చిత్రం 166.50 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఔరా అనిపించింది. ఆ తర్వాతి వారం కూడా ఈ పద్మావత్ చిత్రం 129 కోట్లను వసూలు చేసింది. మరి లేడీ ఒరియంటేటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈస్థాయిలో కలెక్షన్స్ వసూలు చెయ్యడమంటే మాటలు కాదు. అందులోను దీపికా పదుకొనె, సంజయ్ లీల బన్సాలి, రణ్వీర్ సింగ్ లది హిట్ కాంబినేషన్ ఆయే. అందులోను ఈ చిత్రం మొత్తం భారీ తనం ఉట్టిపడుతూ తెరకెక్కడంతో విడుదలైన రోజునుండి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతంగానే నడిపిస్తున్నారు.