శర్వానంద్ మళ్ళీ పోటీకి సిద్దమవుతున్నాడు. ఈ ఏడాది మొదట్లో చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150 ' తో, బాలకృష్ణ 'గౌత్తమిపుత్ర శాతకర్ణి'తో పోటీపడి..... 'శతమానం భవతి' అంటూ ఫామిలీ ఎంటర్టైనర్ తో వచ్చి హిట్ కొట్టాడు. అప్పుడు ఇద్దరు బడా స్టార్స్ మధ్యన శర్వానంద్ ఎందుకొచ్చాడో అని అందరూ తెగ ఇదైయ్యారు. కానీ 'శతమానం భవతి' కథ మీద ఉన్న నమ్మకంతో దర్శక నిర్మాతలు కూడా సంక్రాతి సీజన్ కే మొగ్గు చూపించారు. ఆ సినిమా పాజిటివ్ టాక్ తో 'ఖైదీ...' కి , 'గౌతమీపుత్ర...' కి ఎదురు నిలబడి మరీ గెలవగలిగింది. అప్పట్లో శర్వానంద్ చేసిన సాహసాన్ని అందరూ వేయినోళ్లు పొగిడేశారు.
అయితే ఇప్పుడు ఈ దసరా సీజన్ కి కూడా శర్వానంద్ మరో ఇద్దరు స్టార్ హీరోలతో పోటీకి దిగుతున్నాడనే వార్త మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశా'ని సెప్టెంబర్ 21 న థియేటర్స్ లోకి దింపుతున్నాడు. ఆ నెలలోనే సెప్టెంబర్ 27 న మహేష్ తన 'స్పైడర్' తో వచ్చేస్తున్నాడు. మరి 'జై లవ కుశ' మీద భారీ అంచనాలున్నాయి. అలాగే మహేష్ 'స్పైడర్' మీద కూడా అంచనాలకు మించిన అంచనాలున్నాయి. మరి ఇలాంటి సినిమాలమధ్యన శర్వానంద్ 'మహానుభావుడు'తో దిగడం కరెక్టేనా?
మళ్ళీ సినిమా పై ఉన్న నమ్మకంతోనే శర్వానంద్ ఈ సాహసానికి ఒడిగడుతున్నాడనే న్యూస్ ప్రచారంలో ఉంది. మారుతి డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా వస్తున్న 'మహానుభావుడు' చిత్రాన్ని దసరా కి అంటే సెప్టెంబర్ 29 న విడుదల చెయ్యడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 29 అంటే ఆ తర్వాత వరుసగా మూడు రోజుల సెలవులకి క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో శర్వా ఇలా తెగిస్తున్నాడట. మరి సంక్రాతి బరిలో హిట్ కొట్టినట్టే ఇప్పుడు దసరా బరిలో కూడా హిట్ కొట్టాలనే కసితో 'మహానానుభావుడు' చిత్ర టీమ్ తోపాటు శర్వానంద్ కూడా ఉన్నాడట. చూద్దాం ఖైదీని..., గౌతముని తట్టుకుని శతమానం భవతితో గెలిచిన శర్వా.... ఇప్పుడు కూడా జై లవ కుశ ని, స్పైడర్ ని తట్టుకుని మహానుభావుడు నిలబడతాడేమో చూద్దాం.