2001లో వచ్చిన ‘ఖుషి’లో మధుమతిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భూమిక సినీపరిశమలో తనదైన ముద్ర వేసింది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన భూమిక 2007లో పెళ్లిచేసుకొని కొన్ని నెలలు సినీ పరిశ్రమకు దూరంగా ఉంది. ఆ తరువాత అడపా దడపా చిత్రాలు చేస్తూ తెరపై కనిపిస్తూనే ఉంది. తాజాగా చాన్నాళ్లకు ఆమె తెలుగు తెరపై కనిపించింది. 2014లో లడ్డూ బాబు చిత్రంలో చివరగా కనిపించిన భూమిక తిరిగి మూడు సంవత్సరాల తరువాత 2017 లో ‘ఎం.సి.ఏ’ చిత్రంలో నటించింది.
‘ఎం.సి.ఏ’ చిత్రంలో కీలకపాత్రలో నాని కి వదినగా నటించి ప్రేక్షకుల్ని అలరించింది. 'ఎంసీఏ' లో భూమిక సినిమాకి ఎంతో కీలకమైన పాత్రలో నటించించి అందరి మనసులను గెలుచుకుంది. అలా 'ఎంసీఏ' లో అలరించిన భూమిక మరో తెలుగు చిత్రంలో కూడా నటిస్తుంది. ఆ చిత్రం మరేదో కాదు.. నాగచైతన్య నటిస్తున్న ‘సవ్యసాచి’ . ఈ చిత్రంలో కూడా భూమిక కీలక పాత్రలో నటించనుందట.. సవ్యాసాచి సెట్ లో నాగచైతన్యతో భూమిక కలిసి దిగిన ఫోటో ఇప్పుడు నెట్ లో ప్రత్యక్షమైంది. దాంతో భూమిక ఈ చిత్రంలో నటిస్తుందని విషయం అందరికి తెలిసింది.
అయితే 'ఎంసీఏ' లో నాని కి వదినగా నటించిన భూమిక 'సవ్యసాచి' లో నాగ చైతన్య కి అక్కగా కీలక పాత్రలో నటించనుందని సమాచారం. ఈ చిత్రంలో తమిళ నటుడు మాధవన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే… చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది