అప్పుడు లేదన్నారు... ఇప్పుడు రెండుసార్లు అంటున్నారు

Update: 2017-10-13 18:29 GMT

గత గురువారం రాత్రి రాజుగారి గది ప్రమోషనల్ ఈవెంట్ లో నాగార్జున సమంత - నాగ చైతన్య ల రిసెప్షన్ ఉంటుందో లేదో అన్నట్టుగా మాట్లాడడం... ఈ రోజు శుక్రవారం ఉదయం నుండి చై - సామ్ ల రిసెప్షన్ డౌట్ అంటూ సోషల్ మీడియాలో కథనాలు హల్చల్ చేస్తున్నాయి. మరి రిసెప్షన్ డౌట్ అంటూ వార్తలొస్తున్నవేళ ఇప్పుడు తాజాగా నాగ చైతన్య - సమంత ల రిసెప్షన్ రెండు పట్టణాల్లో జరగబోతుందంటూ మరొక న్యూస్ ఫిలింనగర్ లో హల్చల్ చేస్తుంది. గత వారం గోవాలో అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకున్న నాగ చైతన్య - సమంతల రిసెప్షన్ ని అక్కినేని నాగార్జున హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో అతిరధ మహారథుల సమక్షంలో జరిపిస్తానని మీడియా ముఖంగా ఎప్పుడో సెలవిచ్చాడు.

అయితే ఇప్పుడు కొత్తగా నాగ చైతన్య - సమంత ల రిసెప్షన్ ని నాగ చైతన్య తల్లి లక్ష్మి చెన్నైలో గ్రాండ్ గా అరెంజ్ చెయ్యబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ వేడుకలకి అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు దగ్గుబాటి కుటుంబ సభ్యులు హాజరవుతారని అంటున్నారు. చెన్నైలో లక్ష్మి తన సర్కిల్ లోని అందరిని పిలిచి ఈ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ని ఏర్పాటు చెయ్యబోతున్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో కూడా నాగార్జున నవంబర్ మొదటి వారంలో సినీపెద్దలు, వ్యాపార సన్నిహితులు, బంధువుల సమక్షంలో నిర్వహించబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

మరి చైతు, సామ్ లు పెళ్లిని రెండు పద్ధతుల్లో అంటే హిందూ సంప్రదాయం, క్రిష్టియన్ సంప్రదాయంలో చేసుకున్నట్టుగానే ఈ రిసెప్షన్ వేడుకల్ని కూడా రెండుసార్లు చేసుకుని రికార్డులు సృష్టిస్తారేమో చూడాలి.

Similar News