తాజాగా విడుదలైన డీజే చిత్రం టాక్ తో ఏమాత్రం సంబంధం లేకుండా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలైన రోజు సినిమాకి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతోపాటే క్రిటిక్స్ కూడా దువ్వాడకి దారుణమైన రివ్యూ రేటింగ్స్ ఇచ్చిన విషయము తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని హరీష్ శంకర్, అల్లు అర్జున్ తమ అసహనాన్ని డీజే థాంక్స్ మీట్ లో వ్యక్తపరిచారు కూడా. మరి డీజే కలెక్షన్స్ చూస్తుంటే నిజంగానే డీజే చిత్రానికి దారుణమైన రేటింగ్ ఇచ్చారా? అనే డౌట్ వచ్ఛేస్తుంది.
ఇక ఇప్పుడు అల్లు అర్జున్, హరీష్, దిల్ రాజు, సుబ్బరాజులు అమెరికా పర్యటన జరిపారు. అయితే అక్కడ అల్లు అర్జున్ మాట్లాడుతూ ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పదని, ఏ జోనర్స్ లో తెలుగు సినిమాలు వచ్చినా విదేశీయలు ఆదరిస్తారని చెప్పుకొచ్చాడు. అలాగే టాలీవుడ్ క్రిటిక్స్ ని కూడా బన్నీ తనదైన శైలిలో విమర్శించాడు. ప్రస్తుతం తెలుగులో సినిమా రివ్యూ రాసే చాలా మందికి కమర్షియల్ జోనర్ సినిమా అంటే ఏమిటో తెలియదు. అయినా ఒక సినిమా మీద ఉండే రివ్యూని ఒక్కరు మాత్రమే డిసైడ్ చేసి జనాలకు నెగిటివ్ గా ఎలా చెప్పగలుగుతారని... అయినా రివ్యూ రాసె వారు వారికి నచ్చిన విధంగా రివ్యూ రాస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది. ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటుంది. అలాంటి వారు ఎవరికీ వారు ఇష్టం వచ్చినట్టు స్టార్ రేటింగ్స్ ఇవ్వడం సరైనది కాదంటూ లెక్చర్ ఇచ్చాడు.
మరి అల్లు అర్జున్ సినిమాలు హిట్ అయినప్పుడు ఎక్కువ రేటింగ్ ఇచ్చిన రివ్యూ రైటర్స్ ఇప్పుడు వచ్చిన డీజే సినిమా వాళ్ళకి నచ్ఛలేదు గనక తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. అయినా రేటింగ్స్ ఎక్కువ వేసినప్పుడు మాట్లాడని బన్నీ.... ఇప్పుడేదో కావాలని తక్కువ రేటింగ్స్ ఇచ్చినట్టు మాట్లాడడంసబబు కాదంటున్నారు సదరు రివ్యూ రైటర్స్.