అప్పుడు క్లిక్ అవనిది... ఇప్పుడు అవుతుందా?

Update: 2017-12-06 08:58 GMT

బాహుబలి సీరీస్ తో నటీనటులంతా లాభ పడినా ఒక్క తమన్నా మాత్రం లాస్ అయ్యింది. బాహుబలి సినిమా దగ్గర నుండి తమన్నా కి సినిమా అవకాశాలే లేకుండా పోయాయి. బాహుబలికి ముందు నుండే చేతిలో అవకాశాలు లేక కొట్టుకుంటున్న తమ్ము బాహుబలి మీద చాలా ఆశలు పెట్టుకుంది. కానీ బాహుబలి తో ఆమె అనుకున్న ఆశలు నెరవేరక పోగా అస్సలు అవకాశాలు లేకుండా పోయాయి. అయితే ప్రస్తుతం క్వీన్ సినిమా రీమేక్ లో నటిస్తున్న తమన్నా మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే ఈసారి సౌత్ లో కాదు..... బాలీవుడ్ లో. తమిళ్ లో హిట్ అయిన జిగర్ తాండా సినిమా హిందీ రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా నటించనుంది.

తమన్నాకి తెలుగు, తమిళంలో మంచి స్టార్ డమ్ వచ్చినప్పటికీ.. బాలీవుడ్ లో మాత్రం ఎదురుగాలి వీచింది. తమన్నా నటించిన బాలీవుడ్ సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయినవే. ఇకపోతే జిగర్తాండా సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయింది. తమిళంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ డ్రామాలో సిద్దార్థ్ హీరో. హిందీ రీమేక్ లో సిద్దార్థ్ పోషించిన పాత్రను ఫర్హాన్ అక్తర్ పోషించబోతున్నాడు. అలాగే లక్ష్మీమీనన్ క్యారెక్టర్ ను తమన్నా చేయబోతోంది. సినిమాలో అత్యంత కీలకమైన విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. తమిళ వెర్షన్ లో ఈ పాత్రకు బాబీ సింహా అద్భుతంగా నటించి ప్రాణం పోశాడు.

కాకపోతే... ఈ రీమేక్ తమన్నా బాలీవుడ్ కెరీర్ కు ఏమేరకు ఉపయోగపడుతుందనేది పెద్ద ప్రశ్న. అలా ఎందుకంటున్నారంటే... ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. పైగా డీ గ్లామరైజ్డ్ రోల్. ఇలాంటి సినిమాతో మరోసారి బాలీవుడ్ లో తన లక్ చెక్ చేసుకోబోతోంది తమ్ము బేబీ.

Similar News