అప్పుడు కాదని... ఇప్పుడు బాధ పడుతున్నాడు

Update: 2017-10-02 05:39 GMT

అర్జున్ రెడ్డి సినిమాని సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కించక ముందు ఆ స్టోరీ ని శర్వానంద్ కి వినిపించినట్లుగా వార్తలొచ్చాయి. ఇక శర్వానంద్ అప్పట్లో ఆ అర్జున్ రెడ్డి కథని రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ అవకాశాన్ని కాదన్నందుకు ఇప్పుడు శర్వా బాగానే బాధపడుతున్నాడు. ఇదే విషయాన్ని తాను నటించిన మహానుభావుడు సంభందించిన ఒక ఇంటర్వ్యూ లో ఆ సినిమా అవకాశం చేజారిపోవడం పట్ల బాధను వ్యక్తం చేశాడు శర్వా. అసలు అర్జున్ రెడ్డి కథను సందీప్ రెడ్డి ముందు తనకే చెప్పాడని కానీ నిర్మాతల వద్దకు పంపితే వారు వద్దన్నారని.... అందుకే ఆ సినిమా చేయలేకపోయానని... అందుకు కొంత బాధగానే ఉందని చెబుతున్నాడు శర్వానంద్.

ఇక అర్జున్ రెడ్డి సినిమా చూశాక దాన్ని విజయ్ దేవరకొండ తప్ప ఇంకెవ్వరూ చేయలేరని.... ఇండస్ట్రీకి మరొక కొత్త యువ హీరో దొరికాడనే ఫీలింగ్ కలిగిందని చెబుతున్నాడు. అలాగే తాను ఫార్ములా తరహా సినిమా చేస్తే జనం చూడరని.... అందుకే కొత్తగా ఉండేలా చేయడానికే ప్రయత్నిస్తానని చెబుతున్నాడు. ఇక శర్వా నంటించిన మహానుభావుడు చిత్రం ఈ దసరాకి విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సూపర్ కలెక్షన్స్ తో క్లీన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం క్లీన్ హిట్ కొట్టేసింది.

ఇకపోతే ఇప్పుడు శర్వానంద్ చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే.... సందీప్ రెడ్డి వంగా తన రెండవ సినిమాని ని శర్వానంద్ హీరో గా తెరకేక్కిస్తాడు అనే వార్త నిజమయ్యేలాగే కనబడుతుంది.

Similar News