ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ ఏమైనా అవుతుందంటే అది రామ్ గోపాల్ వర్మ తీయబోయే ఎన్టీఆర్ జీవిత చరిత్రలోకి ఒక భాగం లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పుకోవాలి. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోయింది. అయితే ఈ సినిమా కన్నా ముందు రామ్ గోపాల్ నాగార్జునతో అనుకున్న సినిమా స్టార్ట్ చేస్తాడు. నాగార్జున సినిమా కొంచెం పూర్తవగానే వర్మ... ఎన్టీఆర్ సినిమా పై ఫోకస్ చేయున్నట్టు తెలుస్తుంది.
అయితే ఎన్టీఆర్ జీవితంపై సినిమా కాబట్టి.. మొదటగా ఎదురయ్యే ప్రశ్న.. ఎన్టీఆర్ గా నటిస్తున్నది ఎవరు అని. బయోపిక్స్ లో పాత్రలకు నటీనటులను ఎంచుకోవడంలో వర్మ స్టైల్ సూపర్ గా ఉంటుంది. దానికి ఉదాహరణే అతను తీసిన సినిమాలు వంగవీటి.. వీరప్పన్. ఈ సినిమాల్లో పాత్రలు చూస్తేనే మనకి అర్ధం అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గా నటించే నటుడిని కూడా సెలెక్ట్ చేసేసుకున్నాడట వర్మ.
ఇండస్ట్రీకి కొత్తవాడైనా.. ఈ నటుడు చూసేందుకు ఎన్టీఆర్ ను పోలినట్లుగా ఉండడం విశేషంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఇతనికి తన ఆఫీస్ లోనే స్పెషల్ గా వర్మ ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నటుడు గురించి ఎలాంటి విషయాలు బయటకు రానివట్లేదు రామ్ గోపాల్ వర్మ. మూవీ ఫస్ట్ లుక్ తాను అఫీషియల్ గా రిలీజ్ చేసేవరకూ.. ఎన్టీఆర్ పాత్రలో నటించేది ఎవరనే డీటైల్స్ బయటకు రాకుండా ఉండాలని వర్మ ఆర్డర్ వెసినట్లుగా టాక్ వినిపిస్తోంది