అప్పటికి రాజెవరో రెడ్డవారో!!

Update: 2017-07-12 07:00 GMT

ఎన్టీఆర్ కి 'జనతా గ్యారేజ్' తో హిట్టిచ్చిన దర్శకుడు కొరటాల శివ అంటే ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఏ అవార్డు ఫంక్షన్ కి వెళ్లినా కూడా ఎన్టీఆర్, కొరటాలతోనే కలిసి వెళతాడు. అలాగే మరే ఇతర ఫంక్షన్ అయినా కూడా ఎన్టీఆర్ కొరటాలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు. ఇక 'జనతా గ్యారేజ్' వంటి భారీ హిట్టిచ్చిన కొరటాలకు ఎన్టీఆర్ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్లు కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక కొరటాలతో ఉన్న అనుబంధంతో మరోసారి ఎన్టీఆర్, కొరటాల డైరెక్షన్ లో సినిమా చెయ్యాలనుకున్నాడు.

అయితే ఇప్పుడు చేస్తున్న 'జై లవ కుశ' పూర్తవ్వగానే త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా త్వరగా పూర్తి చేసి కొరటాలతో సినిమా చెయ్యాలని అనుకున్నాడు. ఇక కొరటాల కూడా మహేష్ తో చేసే 'భరత్ అను నేను' సినిమా తర్వాత ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేద్దామని అనుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకెళ్ళేది వచ్చే ఏడాదే అంటున్నారు. కారణం పవన్ తో త్రివిక్రమ్ చేసే సినిమా ఈ దసరాకి కాకుండా సంక్రాంతికి షిఫ్ట్ అవడంతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కూడా లేటుగా సెట్స్ మీదకెళ్లే అవకాశం ఉండడం ఆ సినిమా పూర్తయ్యేసరికి వచ్చే ఏడాది ఎండ్ చివరికి పూర్తవడం వంటి విషయాలతో కొరటాల మూవీ లేట్ గా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందట.

అందుకే కొరటాల, మహేష్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ని డైరెక్ట్ చెయ్యడానికి చాలా సమయం పెట్టె అవకాశం ఉండడంతో ఈలోపు రామ్ చరణ్ తో సినిమాని లైన్ లో పెట్టుకున్నాడు. మరి ఈ లెక్కన ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కే మూవీ 2019 మొదట్లోగాని సెట్స్ మీదకెళ్లే పరిస్థితి లేదంటున్నారు. అయితే ఈ లోపు కాంబినేషన్స్ మారిపోవచ్చు. మరో డైరెక్టర్ ఎన్టీఆర్ కి లైన్ లోకి రావచ్చు. అలాగే కొరటాలకు మరో హీరో దొరకవచ్చు అప్పటికి రాజెవరో రెడ్డవారో అంటున్నారు.

Similar News