అన్నిటిలోలను ఇదే కనబడుతుంది

Update: 2017-12-03 14:00 GMT

ఎప్పుడు లేనిది ఈ మధ్యకాలంలో బడా సినిమాల ఆడియో హక్కులు పై రోజుకో న్యూస్ వినబడుతుంది. పవన్ - త్రివిక్రమ్ సినిమా అజ్ఞాతవాసి ఆడియో హక్కులు 2 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది అనుకునే లోపే... చిరంజీవి సై రా నరసింహారెడ్డి చిత్రం 2 .9 కోట్లకు అమ్ముడు పోయి సంచలనం అయ్యింది. ఈ సినిమా మొదలు కాకముందే.. సై రా ఆడియో హక్కులు ఈ రేటుకు అమ్ముడు పోవడం కూడా ఒక రికార్డ్. అయితే సైరా ఆడియో హక్కులను ఆదిత్యతో పోటీ పడి లహరి మ్యూజిక్ సంస్థ ఎగరేసుకు పోయింది.

ఇక అజ్ఞాతవాసి, సై రా వంటి పెద్ద ప్రోజెక్టుల సినిమాల ఆడియో రైట్స్ ని దక్కించుకున్న లహరి మ్యూజిక్ వాళ్ళే మహేష్ బాబు - కొరటాల శివ కలయికలో వస్తున్న భరత్ అనే నేను సినిమా ఆడియో హక్కులని 1.9 కోట్లకు కొట్టేసింది. మరి ఇలా బడా ప్రాజెక్టులను వరుసగా దక్కించుకుంటున్న లహరి మ్యూజిక్స్ వాళ్ళు ఇప్పుడు మరో బడా ప్రాజెక్ట్ ని కూడా దక్కించుకున్నారని సమాచారం అందుతుంది. రామ్ చరణ్, సుకుమార్ కలయికలో లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సినిమా రంగస్థలం 1985 సినిమా ఆడియో హక్కులను కూడా లహరి మ్యూజిక్ వాళ్ళే ఎగరేసుకుపోయారనే టాక్ వినబడుతుంది.

పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న రంగస్థలం ఆడియో, వీడియో సాంగ్స్ హక్కులను లహరి వాళ్ళు 1.60 కోట్లకు డీల్ ను క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. మరి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్న ఈ సినిమా ఆడియో కి ఎంత క్రేజ్ ఉందొ ఈ డీల్ ద్వారా అర్ధమవుతుంది. ఇకపోతే అన్నిటిలో ఫస్ట్ వుండే ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న కారణంగా.. ఆడియో హక్కులపై ఇంట్రెస్ట్ చూపించక పోవడం వలన క్రేజీ ప్రోజెక్టుల ఆడియో హక్కులను లహరి వాళ్ళు చేజిక్కించుకున్నారనే టాక్ వుంది.

Similar News