అన్ని తెలిసినట్టే చెబుతుందే!!

Update: 2017-06-29 03:54 GMT

రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడో అనే దాని మీద ఇంతవరకు స్పష్టత లేదుగాని ఆయన పార్టీ పెడితే మాత్రం రజిని పార్టీలోకి వచ్చేసేందుకు సినీప్రముఖులు చాలామందే లైన్ లో ఉన్నారు. మొన్నటికి మొన్న ఖుష్బూ వేరే కారణంతో రజిని ని ముంబై లో మీట్ అయితే ఇంకేముంది రజినీకాంత్ కొత్త పార్టీలో ఖుష్బూ చేరబోతోంది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. అలాగే బోలెడుమంది రజిని పార్టీలోకి చేరడానికి సిద్దమవుతున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం పొలిటికల్ ఎంట్రీ మీద ఎటువంటి క్లారిటీ లేకుండా సమాధానం దాటవేస్తున్నాడు. అయితే రజిని పార్టీ మీద ఎంతమంది సానుకూలంగా వున్నారో అంతేముంది వ్యతిరేఖంగాను ఉన్నారు. ఇంకా ఆయన రాజకీయాల్లోకి రాకముందే రజిని పార్టీ మీద తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం చేస్తున్నారు కొంతమంది తమిళులతోపాటే ప్రముఖులు కూడా.

అయితే ఇప్పుడు రజినీకాంత్ పార్టీ మీద మరో సీనియర్ నటి తెగ ప్రేమ కురిపిస్తోంది. ఆమె ఎవరోకాదు అన్నమయ్య చిత్రంలో నాగార్జునతో జోడి కట్టిన కస్తూరి. కస్తూరికి హీరోయిన్ గా ఎక్కువ సినిమాలో నటించినా కూడా ఆమెకు టాలీవుడ్ లో సరైన అవకాశాలు లేక చాలాకాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే తమిళంలో మాత్రం కాస్త గట్టిగానే నిలదొక్కుకున్నప్పటికీ తర్వాత పెళ్ళిచేసుకుని సెటిల్ అయ్యింది. మరి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా వున్న కస్తూరికి ఈ మధ్యన రాజకీయాల మీద మోజు పుట్టి రాజకీయరంగ ప్రవేశం చెయ్యడానికి సిద్దమవుతుంది. అలాగే రజినీకాంత్ పార్టీలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టే కనబడుతుంది. ఈ మధ్యనే రజనీకాంత్‌తో కలిసి రాజకీయాల గురించి చర్చించడం తమిళ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

ఇక కస్తూరి, రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ రజిని రాజకీయాల్లోకి రావడం తధ్యమని... అది దీపావళికి జరగొచ్చని చెబుతుంది. ఆయనకు ఇప్పుడున్న వ్యవస్థ మీద విరక్తి పుట్టి, డబ్బు తో కూడిన రాజాకీయాలంటే విసుగు చెంది అయన ప్రస్తుత రాజకీయాల్ని ప్రక్షాళన చేయడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. అసలు ఆమె రజినితోకలిసి నడుస్తుందా? అసలు నిజంగానే రజిని, కస్తూరితో రాజకీయాల గురించి చర్చించాడా? అనేది మాత్రం కాస్త క్లారిటీ రావాల్సి వుంది.

Similar News