అన్ని చకచకా

Update: 2017-10-13 04:53 GMT

మహేష్ హీరోగా మురుగదాస్ దర్శకుడిగా వచ్చిన స్పైడర్ చిత్ర హడావిడి దాదాపు ముగిసినట్టే. స్పైడర్ చిత్రం టాక్ తో డల్ అయిన మహేష్ బాబు తన ఫ్యామిలీ తో రిఫ్రెష్ అవడానికి విదేశాలకు వెళ్ళిపోయాడు. తన పాటికి తాను భార్య పిల్లల్తో ఉత్సాహంగానే గడిపాడు కానీ ఇక్కడ స్పైడర్ బయ్యర్ల పరిస్థితే ఉసూరుమనిపించేసింది. స్పైడర్ తో బయ్యర్లు రోడ్డున పడినట్లుఆగా వార్తలొస్తున్నాయి. ఇక సినిమా రిజల్ట్ సంగతి ఏమోగానీ స్పైడర్ కోసం కష్టపడిన కష్టాన్ని మర్చిపోవడానికి విదేశాలకెళ్లిన మహేష్ ఆ టూర్ పూర్తిచేసుకుని హైదరాబాద్ కి వచ్చేసాడు.

ఇక హైదరాబాద్ చేరుకున్న మహేష్ బాబు... కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో జాయిన్ అయిపోతాడని తెలుస్తుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ సగం పూర్తి చేసుకున్న భరత్ అనే నేను చిత్రం ఇప్పుడు మిగతా షూటింగ్ ని కూడా చక చక జరపాలని చూస్తుంది ఇక మహేష్ కూడా ఈనెల 15 నుండి భరత్ సెట్స్ లోకెళ్ళిపోతాడట. ఇక షెడ్యూల్ మొద‌ల‌య్యాక ఎలాంటి గ్యాప్స్ ఇవ్వకుండా భరత్ అనే నేను సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసేస్తారట. ఎందుకంటే ఆ త‌ర్వాత మ‌ళ్లీ మ‌హేష్ కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ కోసం కాల్షీట్లు కేటాయించేశాడు. మహేష్ 25వ సినిమా వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.

మహేష్ భరత్ అనే నేను చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి గాని లేకుంటే మార్చ్ లో గని విడుదల చేసినప్పటికీ వంశి పైడిపల్లితో చేసే సినిమాని మాత్రం జనవరి చివరి వారంలో పట్టాలెక్కించి దసరాకి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు మహేష్, వంశి పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాని చేస్తున్నాడు మహేష్.

Similar News