ప్రభుదేవా పేరు చెప్పగానే ముందుగా మనకు ఒక కొరియోగ్రాఫర్ గానే అతను గుర్తుకు వస్తాడు. మరి కొరియోగ్రాఫర్ గా పీక్ లో ఉండగా 'ప్రేమికుడు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవా అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. మరి ఇన్ని కళలతోనన్నా మనోడు ఆగాడా అంటే లేదు. మల్లి 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో డైరెక్టరుగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. మరి డైరెక్టర్ గా టాలీవుడ్ లో సక్సెస్ అందుకున్న ప్రభుదేవా అక్కడ బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. బాలీవుడ్ లో కూడా డైరెక్టర్ గా మంచి సినిమాలందించిన ప్రభుదేవాకి రీల్ లైఫ్ లో ఎన్ని సంచలనాలను క్రియేట్ చేసాడో... రియల్ లైఫ్ లో కూడా అంతే సంచలనం అయ్యాడు.
తన భార్య రామలత కి విడాకులిచ్చి నయనతారతో పెళ్ళికి సిద్ధపడ్డాడు. కోలీవుడ్ లో నయనతారతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన ప్రభుదేవాకి నయనతార కు మధ్యన ఏం విభేదాలొచ్చాయో కానీ ఇద్దరికీ బ్రేకప్ అయ్యి విడిపోయారు. మళ్ళీ ప్రభుదేవా కెరీర్ లో బిజీ అవ్వడము జరిగింది. ఇక కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా, హీరోగానూ సక్సెస్ అయిన ప్రభుదేవా గత ఏడాది ప్రొడ్యూసర్ అవతారం కూడా ఎత్తాడు. మరి ఇన్ని కళలున్నా ప్రభుదేవా ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడనే టాక్ వినబడుతుంది.
ఇక ఇప్పుడు ప్రభుదేవా విలన్‌గా టర్న్ తీసుకోబోతున్నాడట . కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో రాబోయే న్యూమూవీలో విలన్‌గా కనిపిస్తాడట ప్రభుదేవా. ' మెర్క్యూరీ ' టైటిల్ తో తెరకెక్కబోయే ఈ థ్రిల్లర్ మూవీలో ప్రభుదేవా విలన్ క్యారెక్టర్ చాలా హైలెట్ అవుతుందనేది ఇప్పుడు కోలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతున్న మాట. మరి ఇన్ని కళల్లో సక్సెస్ సాధించిన ప్రభుదేవా ఇప్పుడు విలన్ గా కూడా సక్సెస్ సాధిస్తాడేమో చూద్దాం.