అన్ని ఉత్తిత్తి మాటలే!!

Update: 2017-07-12 04:45 GMT

నిన్నగాక మొన్న టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కురచని భామ నివేత థామస్. ఈమె నానితో 'జెంటిల్‌మేన్‌'లో, తాజాగా 'నిన్నుకోరి' చిత్రాలలో జోడి కట్టింది. ఆమె అందం, అభినయం, నటనతో అందరిని అతి తక్కువ సమయంలోనే ఆకట్టుకుంది. నివేత టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసి లక్కీ లేడీగా పేరు కొట్టేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ జై లవ కుశ లో ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తుంది. ఇక వరుస సినిమాలతో ఓ సందర్బంగా నాని అంటే నాకెంతో ఇష్టం అంటూ ఆ మధ్యన చెప్పుకొచ్చింది. ఆయన సినిమాలన్నింటినీ నేను తప్పకుండా మిస్‌ కాకుండా చూస్తూ ఉంటాను అని చెప్పింది.

అయితే రెగ్యులర్ గా నాని సినిమాలన్నీ వాచ్ చేస్తానని చెప్పిన నివేత ఏ సినిమా దగ్గర నుండి నానిని లైక్ చేస్తుందో మాత్రం చెప్పలేదు. అయితే ఇప్పుడు నివేత ఇష్టం మరొకరి మీదకి షిఫ్ట్ అయినట్లు చెబుతుంది. ఇప్పుడు తాజాగా ఆమె ఎన్టీఆర్‌ తో కలిసి 'జై లవకుశ'లో నటిస్తోంది కాబట్టి..... ఎన్టీఆర్‌ నా ఆల్‌టైం ఫేవరేట్‌ ఆర్టిస్ట్‌ అంటూ చెబుతుంది. ఆయన చిత్రాలన్నీ చూశాను ఆయనో గొప్పనటుడు అంటూ కితాబిచ్చేసింది. ఇక ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాత్రం ఇప్పుడే చెప్పదట. సస్పెన్స్‌ అంటోంది. మరి ఏ హీరోతో నటిస్తే ఆ హీరోనే తన ఫెవరెట్ అనేలా కనబడుతుందిగా నివేత. అంటే నివేత చెప్పేవన్నీ బిస్కెట్స్ అన్నమాట. ఇక నివేత పొగడ్తలకు ఎవరు టెంప్ట్ కాకండే..!!

Similar News