నిన్న సోమవారం ఎన్టీఆర్ కలల ప్రాజెక్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అధికారికంగా మొదలైంది. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా త్రివిక్రమ్... స్నేహితుడు పవన్ కళ్యాణ్ హాజరవడమే కాక ఎన్టీఆర్ సినిమాకి క్లాప్ కొట్టి మరీ వచ్చాడు. అక్కడ ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఎంతో సరదాగా ముచ్చడించుకోవడమే కాక ఎన్టీఆర్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కి బెస్ట్ విషెస్ తెలిపాడు. అయితే అలా ఒక మెగా హీరో ఎన్టీఆర్ సినిమాకి క్లాప్ కొట్టడం కొత్తకాదు. ఇంతకుముందే రామ్ చరణ్... ఎన్టీఆర్ సినిమాకి క్లాప్ కొట్టడం... ఆ సినిమా హిట్ అవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మరో మెగా హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి క్లాప్ కొట్టడం మాత్రం ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలకు దారి తీసింది.
ఎన్టీఆర్ ని పవన్ కళ్యాణ్ కౌగిలించుకోవడం, ఎన్టీఆర్ తో పవన్ కళ్యాణ్ ముచ్చట్లు పెట్టడం చూసిన దగ్గర నుండి... పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ కలయికలో త్రివిక్రమ్ ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని... అదేం కాదు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎన్టీఆర్ మద్దతిస్తున్నాడని... ఇక ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ ని త్రివిక్రమ్ లాంచ్ చేస్తున్నాడని ఇలా ఒకటేమిటి అనేకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టిడిపి తో పవన్ కళ్యాణ్ జనసేన దాదాపు విడిపోయినట్లే అనుకున్న సమయంలో ఎలాగూ టిడిపికి దూరం గా ఉంటున్న ఎన్టీఆర్.. పవన్ ఒకేచోట కలవడంతో ఇలా జనసేనకు ఎన్టీఆర్ మద్దతు అనే టైటిల్, ఇక త్రివిక్రమ్ స్నేహితుడు పవన్ కళ్యాణ్ కాబట్టి త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్, ఎన్టీఆర్ కలిసి మల్టి స్టారర్ అంటూ న్యూస్ వచ్చేసాయి.
అయితే ఇవన్నీ కేవలం గాసిప్స్ అన్న విషయం అందరికి తెలిసినా ఇలాంటి విషయాలను మాత్రం జనాలను ఇంట్రస్టింగ్ గా చర్చించుకుంటుంటారు. అందుకే ఇలాంటి గాసిప్స్ కి ఏ భాషల్లోనూ కొదవుండదు.